నవీన్ పొలిశెట్టి, అనుష్క జంటగా యూవీ క్రియేషన్స్ సంస్థ ఓ చిత్రాన్ని రూపొందిస్తున్న విషయం తెలిసిందే. మహేష్‌బాబు దర్శకుడు. ఈ చిత్రంలో అనుష్క చెఫ్ అన్విత రవళి శెట్టి పాత్రలో కనిపించనుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జరుపుకుంటున్నది. సోమవారం అనుష్క పుట్టిన రోజు సందర్భంగా ఆమె ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఇందులో ఆమె వంటలు సిద్ధం చేస్తూ కనిపిస్తున్నది. ‘వినూత్నమైన కథాంశంతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాం. అనుష్క పాత్ర కొత్త పంథాలో ఉంటుంది. చాలా విరామం తర్వాత ఆమె నటిస్తున్న ఈ చిత్రం తప్పకుండా ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుంది’ అని చిత్రబృందం పేర్కొంది. రెండేళ్ల క్రితం ‘నిశ్శబ్దం’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకొచ్చింది అనుష్క. ఓటీటీలో ఈ చిత్రాన్ని విడుదల చేశారు. ప్రస్తుతం యూవీ క్రియేషన్స్ చిత్రంతో పాటు మలయాళంలో ‘ఒట్టక్కొంబన్’ అనే చిత్రంలో అనుష్క నటిస్తున్నది.