అనుష్కశెట్టి ప్రధాన పాత్రలో నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం ‘ఘాటీ’. విక్రమ్‌ప్రభు కీలక పాత్రధారి. క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని రాజీవ్ రెడ్డి, సాయిబాబు జాగర్లమూడి నిర్మిస్తున్నారు. సెప్టెంబర్ 5న విడుదలకానుంది. బుధవారం థియేట్రికల్ ట్రైలర్‌ను ఆవిష్కరించారు. బ్రిటీష్‌కాలంలో ప్రమాదకరమైన కొండప్రాంతాల్లో నివసించే ఘాటీ తెగ తాలూకు ప్రపంచాన్ని ఆవిష్కరిస్తూ ట్రైలర్ ఆసక్తికరంగా మొదలైంది.
తొలుత నేర సామ్రాజ్యంలో భాగమైన అనుష్క ఆ తర్వాత తప్పు తెలుసుకొని వ్యవస్థపై తిరుగుబాటు చేస్తుంది. ఈ క్రమంలో ఆమె ఓ క్రిమినల్ నుంచి లెజెండ్‌గా మారే ప్రస్థానమే సినిమా కథాంశంగా అర్థమవుతున్నది. పవర్ఫుల్ యాక్షన్ ఘట్టాలతో అనుష్కశెట్టి తన పాత్రకు జీవం పోసింది. విజువల్స్ ఆకట్టుకునేలా ఉన్నాయి. ఈ చిత్రానికి సంగీతం: నాగవెల్లి విద్యాసాగర్, సంభాషణలు: సాయిమాధవ్ బుర్రా, రచన-దర్శకత్వం: క్రిష్ జాగర్లమూడి.