Ghaati Movie Review | అరుంధతి, సరోజా, దేవసేన, రుద్రమదేవి, భాగమతి.. ఇవన్నీ అనుష్క కెరీర్లో మైలురాయి లాంటి పాత్రలు. వేదం సినిమాలో సరోజా లాంటి ఐకానిక్ పాత్రని ఇచ్చిన క్రిష్‌తో స్వీటీ మరోసారి చేతులు కలిపి ‘ఘాటి’ తో ఇప్పుడు ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ప్రచార చిత్రాలు సినిమాపై ఆసక్తిని పెంచాయి. ఘాటీలో శీలావతి తన కెరీర్లో మరో మైలురాయిలాంటి పాత్ర అవుతుందని నమ్మకంగా చెప్పింది స్వీటీ. మరి ఆ నమ్మకం నిజమైయిందా? వేదం మ్యాజిక్ రిపీట్ అయ్యిందా? ఇంతకీ ఈ ఘాటి కథేమిటి? ఇదంతా రివ్యూల్లో చూద్దాం.
కథ: ఆంధ్ర-ఒడిశా బోర్డర్స్. అక్కడి తూర్పు కనుమల్లో కుందుల నాయుడు (చైతన్య రావు), కాష్టాల నాయుడు (రవీంద్ర విజయ్) గంజాయి మాఫియా సాగిస్తుంటారు. ఘాటీలుగా పిలవబడే స్థానిక ప్రజలు ఈ ఇద్దరి గుప్పెట్లో ఉంటూ గంజాయి రవాణా చేస్తుంటారు. అదే ప్రాంతంలో వుండే శీలావతి (అనుష్క), దేశీ రాజు (విక్రమ్ ప్రభు) ఆ పనికాకుండా వేరే పనులు చేసుకుంటూ జీవితాన్ని గడుపుతుంటారు. కానీ అనుకోని పరిస్థితులు వలన తిరిగి మళ్లీ గంజాయి స్మగ్లింగ్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది. వారు ఎందుకు మళ్ళీ స్మగ్లింగ్ చేయాల్సి వచ్చింది? ఈ క్రమంలో ఎలాంటి పోరాటం చేశారనేది మిగతా కథ.
విశ్లేషణ: దర్శకుడు క్రిష్ ఎంచుకున్న సెటప్ బలంగా ఉంది. ఘాటి కమ్యూనిటీ నేపథ్యం కొత్తదనాన్ని తెస్తుంది. గంజా మాఫియా, స్థానిక ఘాటీల చుట్టూ తిరిగే ఫస్ట్ నెమ్మదిగా సాగినప్పటికీ కథలో తీవ్రతని పెంచగలిగింది. ఆంధ్ర – ఒడిశా ఈస్టర్న్ ఘాట్స్ నేపథ్యంలో కథ నడవడం ఫ్రెష్‌నెస్ తీసుకొచ్చింది. మంచి ఇంటర్వెల్ బ్లాక్ కుదిరింది.
సెకండ్ హాఫ్ దేశీ రాజు,శీలావతి బ్యాక్స్టోరీలో ఎమోషన్ వర్క్ అవుట్ అయ్యింది. ఆ తర్వాత కథ రివెంజ్ డ్రామాగా మారిన తీరు ఆకట్టుకుంటుంది. ఈ రివెంజ్ ట్రాక్ ఆడియన్స్ ఎంగేజ్ చేయగలిగింది. క్రిష్ రాసిన కొన్ని సీన్లు ఇంపాక్ట్ కలిగించాయి. అయితే సినిమా క్లైమాక్స్ కి చేరుకునే కొద్ది ట్రీట్మెంట్ రొటీన్ గా మారిపోతుంది. స్క్రీన్ ప్లే ఊహకు అందిపోయేలా సాగుతుంది. క్రిష్ బలం బలమైన ఎమోషన్స్ ని పలికించడం. కానీ ఇందులో పాత్రల్లో వుండే ఎమోషన్స్ అంతగా పైకి రాలేదు. కాకపోతే గంజాయి వలన కలిగే పర్యవసానాలు చూపించిన తీరు సందేశాత్మకంగా వుంటుంది. అనుష్క స్ట్రాంగ్ స్క్రీన్ ప్రజెన్స్ ఆమె అభిమానులకు నచ్చుతుంది.
నటీనటులు నటన: శీలావతి పాత్రలో అనుష్క ఒదిగిపోయింది. ఎమోషనల్ సీన్స్‌లో మెప్పించిన స్వీటీ యాక్షన్ సన్నివేశాల్లో అదేస్థాయిలో అదరగొట్టింది. క్రిష్ శీలావతి పాత్రకి ఇచ్చిన ఎలివేషన్స్ బావున్నాయి. శీలావతి పాత్ర అనుష్క అభిమానులకు గుర్తిండిపోతుంది. ఈ స్థాయిలో యాక్షన్ చేయడం స్వీటీకి ఇదే ఫస్ట్ టైం. దేశిరాజు పాత్రలో విక్రమ్ ప్రభు డీసెంట్‌గా చేశాడు. ఫస్ట్ హాఫ్ తన చుట్టూనే తిరుగుతుంది. ఈ రెండు కూడా హై ఇంటెన్స్ వున్న పాత్రలే. కుందులు నాయుడు పాత్రలో చైతన్యరావు కొత్త విలనిజం పంచాడు. నిజానికి ఇలాంటి పాత్రలో చైతన్య కనిపించడం ఫ్రెష్‌నెస్ తీసుకొచ్చింది. జగపతిబాబు తినే మ్యానరిజం అంతగా కుదరలేదు. రవీందర్ విజయ్ తో పాటు మిగతా పాత్రలు కూడా కథకు తగ్గట్టుగానే ఉన్నాయి.
టెక్నికల్‌గా: మనోజ్ కెమరావర్క్ సినిమాకి ప్లస్ అయ్యింది. తూర్పు కనుమల్లో చిత్రీకరించిన సన్నివేశాలు ఓ కొత్త అనుభూతిని పంచాయి. నేచర్‌ని తన కెమరా చక్కగా ఒడిసిపట్టుకుంది. సాగర్ పాటలు గుర్తుండవు కానీ నేపధ్య సంగీతం మాత్రం ఇంటెన్స్‌గా చేశారు. యాక్షన్ సీన్స్‌లో తన బీజీఎం హైలైట్ అయ్యింది. సాయి మాధవ్ బుర్రా రాసిన మాటలు కొన్ని ఇంపాక్ట్‌ఫుల్‌గా ఉన్నాయి. ఫస్ట్ ఫ్రేం, యువీ క్రియేషన్స్ నిర్మాణ విలువలు ఉన్నతంగా వున్నాయి.
ప్లస్ పాయింట్స్
అనుష్క స్క్రీన్ ప్రజెన్స్
ఘాటీ బ్యాక్ డ్రాప్, యాక్షన్ సీన్స్
నిర్మాణ విలువలు
మైనస్ పాయింట్స్
తగ్గిన భావోద్వేగాలు
ఊహకు అందే కథనం
రేటింగ్: 2.75/5