Ghaati | టాలీవుడ్ బ్యూటీ అనుష్కా శెట్టి (Anushka Shetty) నటిస్తోన్న పాన్ ఇండియా చిత్రం ఘాటి (Ghaati). క్రిష్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో గ్రాండ్‌గా విడుదల కానుంది. సెప్టెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల చేస్తున్నారు. కాగా మేకర్స్ మ్యూజికల్ అప్డేట్ అందించారు. ఈ మూవీ నుంచి సెకండ్ సింగిల్ అప్డేట్ అందించారు మేకర్స్. దస్సోరా సాంగ్‌ను ఆగస్టు 20న గ్రాండ్‌గా లాంచ్ చేయనున్నట్టు కొత్త లుక్ విడుదల చేశారు.
విక్రమ్ ప్రభు, అనుష్క తమ భుజాలపై భారీ మూటలు మోస్తూ కొండలపై నుంచి వస్తున్న లుక్ పాటపై హైప్ క్రియేట్ చేస్తోంది. ఈ పాటను నాగవెల్లి విద్యాసాగర్ కంపోజ్ చేశాడు. యూవీ క్రియేషన్స్, ఫస్ట్ ప్రేమ్ ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో చైతన్య రావ్, జగపతి బాబు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఏప్రిల్‌లోనే విడుదల కావాల్సిన ఈ చిత్రం వాయిదా పడుతూ వస్తోన్న నేపథ్యంలో నిరాశ చెందుతున్న అభిమానులు, ఫాలోవర్లు ప్రమోషన్స్‌ను వేగవంతం చేయాలని అనుష్క టీంకు రిక్వెస్ట్‌లు పెడుతున్నారు.
ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదల చేసిన జనాలంతా కొండ ప్రాంతం మధ్యలోని దారి వెంట మూటలు మోసుకొని వెళ్తున్న లుక్‌తోపాటు గ్లింప్స్ సూపర్ హైప్ క్రియేట్ చేస్తున్నాయి. ఘాటి అమెజాన్ ప్రైమ్ వీడియోలో పోస్ట్ థ్రియాట్రికల్ రిలీజ్ కానుంది.
Dassora Dassora Huuh ❤️🔥💪🏽🏔️
The Sound and Style of the Ghaatis ✨#Ghaati second single #Dassora out on 20th Aug ❤🔥#GHAATI GRAND RELEASE WORLDWIDE ON 5th SEPTEMBER 2025
⭐ing ‘The Queen’ @MsAnushkaShetty & @iamVikramPrabhu
🎥 Directed by the phenomenal @DirKrish
🏢… pic.twitter.com/w2TErPekq2— BA Raju’s Team (@baraju_SuperHit) August 18, 2025
Rahul Sipligunj | ఆస్కార్ విన్నర్ ఇలా సర్ప్రైజ్ ఇచ్చాడేంటి… సైలెంట్‌గా ఆమెతో నిశ్చితార్థం
Mega Heroes| రెండేళ్లలో మెగా హీరోలు 8 ఫ్లాపులు ఇచ్చారా.. బన్నీ ఒక్కడే నిలబడ్డాడు..!
Newyork India Day Parade | పరేడ్‌లో జంటగా కనిపించిన విజయ్ దేవరకొండ- రష్మిక.. వీడియో వైరల్