Anushka Shetty | సీనియర్ నటి అనుష్క శెట్టి ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ ‘ఘాటి’ రీసెంట్గా అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్కు వచ్చింది. దర్శకుడు క్రిష్ జాగర్లమూడి రూపొందించిన ఈ యాక్షన్ డ్రామా సినిమాపై విడుదలకు ముందు భారీ అంచనాలు ఏర్పడినప్పటికీ, విడుదల తర్వాత మాత్రం ప్రేక్షకుల్లో మిక్స్డ్ రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాలో అనుష్క శెట్టి ఓ పవర్ఫుల్ పాత్రలో కనిపించారు. ఆమె ఎమోషనల్ సీన్స్‌లో చూపిన నటనకు ప్రేక్షకుల నుంచి ప్రశంసలు అందుతున్నాయి. ముఖ్యంగా ఒక పూజా సీన్ ఆమె కెరీర్లో హైలైట్‌గా నిలిచిందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. మరికొందరు ఆమె పెర్ఫార్మెన్స్ను “సలార్”, “కేజీఎఫ్” లెవెల్‌కి పోల్చుతూ ప్రశంసించారు.
అయితే అనుష్క నటన ఎంతగానో మెప్పించినా, సినిమా కథ, స్క్రీన్‌ప్లే మాత్రం ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేకపోయాయి. పేసింగ్ నెమ్మదిగా ఉందని,ఇంటర్వెల్ వరకూ కథ సాగదీసినట్టుంది అని, కొన్ని యాక్షన్ సీన్స్ పండించలేకపోయాని చెప్పుకొస్తున్నారు. సినిమాలో కూడా కొత్తదనం లేదని, స్లోగా కథ నడిచినట్టు అనిపించిందని ప్రేక్షకుల నుండి విమర్శలు వినిపిస్తున్నాయి. కొన్ని సీన్లు రిపిటేటివ్‌గా అనిపించాయని కూడా విమర్శలు వచ్చాయి. కొన్నిచోట్ల విజువల్స్ ఆకట్టుకున్నటికీ, పూర్తిగా ప్రభావితం చేయలేకపోయాయి. బీజీఎం కొన్ని సీన్లలో బాగున్నా, ఎమోషనల్ కంటెంట్‌ను బలంగా తీసుకురాలేదన్న అభిప్రాయం వ్యక్తం అవుతుంది.
మొత్తంగా సినిమా థియేటర్స్‌లో అంతగా అలరించలేకపోయింది. సెప్టెంబర్ 26 నుండి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతున్న ఘాటి నంబర్ వన్ ట్రెండింగ్ లో దూసుకుపోతున్నట్టుగా తెలుస్తుంది. 40 కోట్ల బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మించారు. క్రిష్-అనుష్క కాంబినేషన్లో వచ్చిన సినిమా కాబట్టి హోప్స్ భారీగానే పెట్టుకున్నారు. కాని మూవీ చూశాక ప్రేక్షకులు అంతగా సంతృప్తి చెందలేదు.