Anushka Shetty | టాలీవుడ్ భామ అనుష్క శెట్టి మలయాళం ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వబోతున్న సంగతి తెలిసిందే. ఆమె ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం కథనార్(Kathanar). ఈ సినిమాకు రోజిన్ థామస్ దర్శకత్వం వహిస్తుండగా.. ప్రముఖ నిర్మాత గోకులం గోపాలన్ నిర్మిస్తున్నాడు. హారర్ బ్యాక్‌డ్రాప్‌లో ఈ చిత్రం రాబోతుండగా.. ఈ చిత్రంలో జయసూర్య, ప్రభుదేవ, ప్రేమదేశం వినీత్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. అయితే నేడు అనుష్క శెట్టి పుట్టినరోజు సందర్భంగా ఆమెకి శుభాకాంక్షలు తెలుపుతూ చిత్రబృందం అనుష్క ఫస్ట్ లుక్‌ని విడుదల చేసింది. ఈ చిత్రంలో అనుష్కా నీలా అనే పాత్రలో కనిపించబోతున్నట్లు ప్రకటించింది.

Anushka Shetty