టాలీవుడ్ లేడీ సూపర్‌స్టార్ అనుష్క ఓ మంచి నిర్ణయం తీసుకున్నారు. కొన్నేళ్లుగా మీడియాకు దూరంగా ఉంటున్న స్వీటీ.. తాజాగా సోషల్ మీడియాకు కూడా కొంతకాలం దూరంగా ఉండనున్నట్టు ప్రకటించారు. ఈ విషయాన్ని తానే స్వయంగా రాసి, పోస్ట్ చేశారు. ‘నిజమైన ప్రపంచానికి దగ్గరగా ఉండాలనుకుంటున్నా. అందుకే ఈ స్క్రోలింగ్ లైఫ్‌కు దూరం జరుగుతున్నా.
ఇకనుంచి కొన్నాళ్లపాటు సోషల్ మీడియాకు నేను దూరం. త్వరలో మరిన్ని మంచి కథలతో మరింత ప్రేమతో మీ ముందుకొస్తా.’ అంటూ ఆ లెటర్లో పేర్కొన్నారు అనుష్క. ప్రస్తుతం ఈ లెటర్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అనుష్క అకస్మిక నిర్ణయం గురించి ప్రస్తుతం అంతా
చర్చించుకుంటున్నారు.