Anushka Sharma | బాలీవుడ్ నటి అనుష్క శర్మ, భారత క్రికెట్ స్టార్ విరాట్ కోహ్లీ లండన్ వీధుల్లో ప్రశాంతంగా నడుస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ జంట తమ ఇద్దరు పిల్లలు, వామిక, అకాయ్‌లతో కలిసి లండన్‌లో ఉంటున్న విషయం తెలిసిందే. గత ఏడాది కాలంగా విరాట్, అనుష్క ఎక్కువ సమయం లండన్‌లోనే గడుపుతున్నారు. తమ పిల్లలకు మీడియా హడావిడి లేకుండా సాధారణ జీవితాన్ని అందించడానికి వారు లండన్‌కు మకాం మార్చినట్లు సమాచారం. అయితే లండన్‌లో ఈ జంట సరదాగా వీధుల్లో చక్కర్లు కొట్టింది.
తాజాగా వైరల్ అవుతున్న వీడియోలలో అనుష్క, విరాట్ చేతులు పట్టుకుని లండన్ వీధుల్లో నడుస్తూ కనిపించారు. మరో వీడియోలో, వారు ఒక బేకరీ బయట కూర్చుని ఒకరికొకరు తోడుగా సమయం గడుపుతూ కనిపించారు. ఈ దృశ్యాలు అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. ఇటీవలే టెస్ట్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన కోహ్లీ ప్రస్తుతం విరామం తీసుకుని తన కుటుంబంతో సమయం గడుపుతున్నారు.
Virat Kohli and anushka spotted London street 🥹 pic.twitter.com/AiRUa1zkJM
— ikka villager (@ikkadua_18) July 1, 2025