Anushka Sharma | ఐపీఎల్ అంటే కేవలం మైదానంలో సిక్సర్లు, ఫోర్ల వర్షం మాత్రమే కాదు.. గ్యాలరీలో తారల మెరుపులు కూడా అభిమానులకు ప్రత్యేక ఆకర్షణగా మారుతున్నాయి. ఏప్రిల్ 24న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ టైటాన్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో టీమ్ ఇండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ భార్య, బాలీవుడ్ నటి అనుష్క శర్మ తన స్టైలిష్ లుక్‌తో అందరి దృష్టిని ఆకర్షించారు. మైదానంలో రజత్ పాటిదార్ నేతృత్వంలోని ఆర్సీబీ జట్టు ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించగా.. స్టాండ్స్‌లో అనుష్క తన ఫ్యాషన్‌తో స్పెషల్ హైలైట్‌గా నిలిచారు. ఈ మ్యాచ్‌కు ఆమె ఫ్రెంచ్ బ్రాండ్ సెజాన్కు చెందిన వైట్ రఫుల్ స్లీవ్ టాప్‌ను ఎంపిక చేసుకున్నారు.
వి-నెక్ డిజైన్, ఎంబ్రాయిడరీ వర్క్, లేస్ స్లీవ్స్‌తో ఉన్న ఈ టాప్ సింపుల్‌గా కనిపించినా ట్రెండీగా మెరిసింది. దీని ధర సుమారు 155 యూరోలు, అంటే భారత కరెన్సీలో దాదాపు రూ.17 వేలు. ఈ టాప్కు జోడీగా క్లాసిక్ డెనిమ్ జీన్స్ ధరించి, మినిమల్ బ్రేస్లెట్లతో క్వైట్ లగ్జరీ స్టైల్‌ను ప్రదర్శించారు. అయితే ఆమె లుక్‌లో ప్రధాన ఆకర్షణగా నిలిచింది చేతికి ధరించిన లగ్జరీ వాచ్. పాంథర్ డి కార్టియర్ కలెక్షన్‌కు చెందిన ఈ వాచ్ 18 క్యారెట్ల ఎల్లో గోల్డ్‌తో తయారై, బ్లూ సాఫైర్ క్రౌన్, బ్లూ స్టీల్ హ్యాండ్స్‌తో ప్రత్యేకంగా కనిపించింది. ఇండియాలో ఈ వాచ్ ధర రూ.28 లక్షల నుంచి రూ.61.5 లక్షల వరకు ఉంటుందని అంచనా.
మేకప్ విషయానికొస్తే అనుష్క తనకు సొంతమైన నో-మేకప్ లుక్‌ను కొనసాగించారు. లైట్ పింక్ లిప్‌స్టిక్, సైడ్ పార్టెడ్ హెయిర్‌తో ఫ్రెష్‌గా మెరిసారు. మొత్తానికి ఐపీఎల్ స్టాండ్స్‌ను ఫ్యాషన్ రన్‌వేగా మార్చేసి, తన స్టైల్‌తో మరోసారి అభిమానులను ఫిదా చేశారు అనుష్క శర్మ. ఒకప్పుడు హీరోయిన్గా ఓ వెలుగు వెలిగిన అనుష్క శర్మ ఇప్పుడు సినిమాలు పూర్తిగా మానేసి నిర్మాతగా సందడి చేస్తుంది. ఇక పిల్లల బాగోగులు చూసుకుంటూ జీవితాన్ని సంతోషంగా గడుపుతుంది.