Anushka Ghaati Movie | టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి ప్రధాన పాత్రలో నటిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం ‘ఘాటీ’ మరోసారి వాయిదా పడింది. ఈ విషయాన్ని చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది.
సినిమా అనేది ఒక జీవనది లాంటిది. కొన్నిసార్లు ఉరకలు వేస్తుంది.. కొన్నిసార్లు లోతు పెంచుకోవడం కోసం ఆగుతుంది. ఘాటీ కేవలం ఒక సినిమా కాదు. అది పర్వతల ప్రతిధ్వనులు, అడవి గాలి, ప్రకృతి నుంచి చెక్కబడిన అద్భుతమైన కథ. ఈ సినిమాలోని ప్రతి ఫ్రేమ్ అద్భుతంగా మారడం కోసం, సినిమాను వాయిదా వేయాలని మేము నిర్ణయించుకున్నాము. సినిమాపై మీకున్న ప్రేమకు, మీ సహనానికి మా కృతజ్ఞతలు. అవుట్పుట్ అత్యుత్తమంగా వచ్చిన తర్వాతే సినిమాను విడుదల చేస్తామని అధికారికంగా ప్రకటిస్తున్నాము అంటూ టీమ్ ప్రకటించింది.
క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో అనుష్క నటిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్న విషయం తెలిసిందే. యూవీ క్రియేషన్స్ సమర్పణలో, రాజీవ్ రెడ్డి, సాయిబాబా నిర్మిస్తున్న ఈ చిత్రం నుండి విడుదలైన గ్లింప్స్ ఇప్పటికే ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. తాజా సమాచారం ప్రకారం, సినిమాకు సంబంధించిన సీజీ (కంప్యూటర్ గ్రాఫిక్స్) పనులు ఇంకా పెండింగ్లో ఉన్నాయని, విడుదల తేదీ లోపు అవి పూర్తయ్యే అవకాశం లేదని తెలుస్తోంది.
Team #GHAATI pic.twitter.com/UhUtWuMR6g
— UV Creations (@UV_Creations) July 5, 2025