Anushka – Ghaati | టాలీవుడ్ నటి అనుష్క శెట్టి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజా చిత్రం ఘాటి(Ghaati). ఈ సినిమాకు వేదం, కంచె చిత్రాల దర్శకుడు జాగర్లమూడి కృష్ణ (క్రిష్) దర్శకత్వం వహిస్తున్నాడు. 4 ఏండ్ల నుంచి షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం నేడు షూటింగ్ కంప్లీట్ చేసుకుంది. అయితే నేడు అనుష్క పుట్టినరోజు సందర్భంగా ఆమెకి శుభాకాంక్షలు తెలుపుతూ ఘాటి నుంచి ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు మేకర్స్.
బాధితురాలు, క్రిమినల్, లెజెండ్. అంటూ అనుష్క పోస్టర్ని పంచుకున్నారు. ఈ పోస్టర్‌ను చూస్తుంటే.. అరుంధతి తర్వాత మళ్లీ అలాంటి పవర్ఫుల్ రోల్లో అనుష్క నటించబోతున్నట్లు తెలుస్తుంది. మరోవైపు ఈ సినిమా గ్లింప్స్‌ను నేడు సాయంత్రం 4.05 గంటలకు విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. కొండపోలం వంటి భారీ డిజాస్టార్ తర్వాత క్రిష్ దర్శకత్వంలో ఈ సినిమా వస్తుండటంతో మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇక ఈ సినిమాను యూవీ క్రియేషన్స్ బ్యానర్ తెరకెక్కిస్తుంది.
VICTIM. CRIMINAL. LEGEND.
The Queen will now rule the #GHAATI ❤🔥
Wishing ‘The Queen’ #AnushkaShetty a very Happy Birthday ✨#GhaatiGlimpse Video today at 4.05 PM ✨
In Telugu, Tamil, Hindi, Kannada and Malayalam.#HappyBirthdayAnushkaShetty@DirKrish @UV_Creations… pic.twitter.com/jgZEBPU5gx
— UV Creations (@UV_Creations) November 7, 2024