Anurag Kashyap | అడివిశేష్ (Adivi Sesh), మృణాల్ ఠాకూర్(Mrunal Thakoor) ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతోన్న చిత్రం డెకాయిట్ (Dacoit). ఈ సినిమాకు షానీల్ డియో కథనందిస్తూ దర్శకత్వం వహిస్తున్నాడు. లవ్ & రివేంజ్ డ్రామగా రాబోతున్న ఈ చిత్రం ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. సమ్మర్ కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్న ఈ చిత్రం నుంచి మేకర్స్ తాజాగా ఒక అప్డేట్ పంచుకున్నారు.
ఈ సినిమాతో బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్ టాలీవుడ్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు చిత్రబృందం తాజాగా ప్రకటించింది. ఈ సందర్భంగా అనురాగ్ కశ్యప్ ఫస్ట్ లుక్ విడుదల చేసింది. ఈ ఫస్ట్ లుక్ గమనిస్తే.. అనురాగ్ ఇందులో స్వామిమాల ధరించిన పోలీస్ పాత్రలో కనిపించబోతున్నట్లు తెలుస్తుంది. తెలుగుతో పాటు హిందీలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో అడివిశేష్ , మృణాల్ ఠాకూర్ మొదట ప్రేమికులుగా ఆ తర్వాత బద్ద శత్రువులుగా కనిపించబోతున్నట్లు తెలుస్తుంది.
Deeksha lo unna Police Nannu pattukuntadu ata..
Nannu pattukovalante aa Devude Digi ravali emo 💥
Delighted to have the Amazing @anuragkashyap72 sir in #DACOIT.@mrunal0801 @Deonidas #BheemsCeciroleo @danushbhaskar @abburiravi @KrishSiddipalli @srinagendrapd @KalyanKodati… pic.twitter.com/y33VA50QYv
— Adivi Sesh (@AdiviSesh) February 28, 2025