Vivek Agnihotri | ప్రముఖ బాలీవుడ్ దర్శకులు వివేక్ అగ్నిహోత్రి మరియు అనురాగ్ కశ్యప్ మధ్య మాటాల యుద్ధం నడుస్తుంది. రీసెంట్గా ఒక ఇంటర్వ్యూలో పాల్గోన్న వివేక్ అగ్నిహోత్రి మాట్లాడుతూ.. అనురాగ్‌పై సంచలన వ్యాఖ్యలు చేశాడు. 2007లో విడుదలైన ‘ధన్ ధనా ధన్ గోల్’ సినిమా సమయంలో జరిగిన సంఘటనల గురించి వివేక్ అగ్నిహోత్రి ఒక ఇంటర్వ్యులో పంచుకున్నాడు.
వివేక్ అగ్నిహోత్రి మాట్లాడుతూ, ‘ధన్ ధనా ధన్ గోల్’ సినిమా చిత్రీకరణ సమయంలో అనురాగ్ కశ్యప్ ఎక్కువగా మద్యం సేవించేవారని, దాని కారణంగా ఆయన సెట్‌కు సమయానికి రాలేకపోయేవారని ఆరోపించారు. అంతేకాకుండా, అనురాగ్ తన పనిని మరో దర్శకుడు విక్రమాదిత్య మోత్వానికి అప్పగించారని కూడా ఆయన పేర్కొన్నారు. తమ ఇద్దరి మధ్య భిన్నాభిప్రాయాలు ఉండటం వల్లే విభేదాలు తలెత్తాయని వివేక్ తెలిపారు.
అయితే, వివేక్ అగ్నిహోత్రి వ్యాఖ్యలపై అనురాగ్ కశ్యప్ తీవ్రంగా స్పందించారు. ఆయన తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో వివేక్‌ను ‘అబద్ధాలకోరు’ అంటూ ఘాటుగా విమర్శించారు. ‘ధన్ ధనా ధన్ గోల్’ సినిమా షూటింగ్ లండన్‌లో జరిగిందని, ఆ సమయంలో తాను ఇండియాలో ఉన్నానని ఆయన స్పష్టం చేశారు. అంతేకాకుండా, నేను అలాగే విక్రమాదిత్య మోత్వాని రాసిన స్క్రిప్ట్‌ను వివేక్ అగ్నిహోత్రి వద్దనుకున్నారని, కానీ ఆ తర్వాత ఫుట్‌బాల్ నేపథ్యంలో ‘లగాన్’ తరహా సినిమా తీయాలని నిర్ణయించుకుని సొంత రచయితను పెట్టుకున్నారని అనురాగ్ ఆరోపించారు. తాను కానీ, మోత్వాని కానీ ఆ సినిమా సెట్‌కు ఎప్పుడూ వెళ్లలేదని ఆయన కుండబద్దలు కొట్టారు. ఈ వివాదంలో అనురాగ్ కశ్యప్‌కు మద్దతు తెలుపుతూ విక్రమాదిత్య మోత్వాని కూడా స్పందించారు. కాగా ఈ వివాదం సినీ పరిశ్రమలో ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది.