Anurag Kashyap – Vijay Sethupathi | బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్ బాలీవుడ్‌ను వదిలేసి సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీకి మకాం మార్చిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన తెలుగుతో పాటు తమిళం, మలయాళం సినిమాల్లో నటిస్తున్నాడు. గతేడాది మహారాజ సినిమాతో సూపర్ హిట్‌ను అందుకున్నాడు. అయితే అనురాగ్ తన కూతురు పెళ్లి విషయంకి సంబంధించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఒకవైపు కూతురు పెళ్లి మరోవైపు ఆర్థిక సమస్యలతో బాధపడుతున్న తనని విజయ్ సేతుపతి ఆదుకున్నాడని తెలిపాడు.
తన కుమార్తె ఆలియా కశ్యప్ వివాహానికి అవసరమైన డబ్బు తన వద్ద లేదని ఈ విషయం విజయ్ సేతుపతికి చెప్పినప్పుడు ‘మేము సహాయం చేస్తాము’ అన్నారు. అలానే మహారాజా సినిమాలో విలన్ పాత్రలో నటించడానికి అవకాశం ఇచ్చారు. అలా నా అర్థిక సమస్యలు. ఈ విషయంలో విజయ్ సేతుపతికి నేను ఎప్పుడు రుణపడి ఉంటానని తెలిపాడు.
నిథిలన్ స్వామినాథన్ దర్శకత్వం వహించిన ‘మహారాజ’ చిత్రం 2024 జూన్ 14న విడుదలైంది. ఈ చిత్రంలో విజయ్ సేతుపతి హీరోగా నటించగా, అనురాగ్ కశ్యప్ ఒక విలన్ పాత్రలో కనిపించారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. కేవలం ₹20 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా దాదాపు ₹190 కోట్ల వసూళ్లు సాధించి బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. 2024లో అత్యధిక వసూళ్లు సాధించిన తమిళ చిత్రాలలో ఇది కూడా ఒకటి.