Anurag Kashyap | ప్రస్తుతం దర్శకత్వం కంటే నటనపైనే దృష్టి పెడుతున్నారు అనురాగ్కశ్యప్. గత ఏడాది తమిళ చిత్రం ‘మహారాజ’లో ఆయన పోషించిన విలన్ పాత్రకు మంచి పేరొచ్చింది. తాజాగా ఆయన అడివి శేష్ ‘డెకాయిట్-ఒక ప్రేమకథ’ చిత్రంలో పోలీస్ పాత్రలో కనిపించనున్నారు. అయ్యప్ప భక్తుడైన పోలీస్ అధికారిగా ధైర్యం, నిజాయితీ కలబోసిన కీలక పాత్రలో అనురాగ్ కనిపిస్తారని మేకర్స్ చెప్పారు.
ఇది సవాలుతో కూడుకున్న పాత్రని, కాస్త హాస్యంతో సాగుతుందని అనురాగ్ పేర్కొన్నారు. తనకు ద్రోహం చేసిన మాజీ ప్రియురాలిపై ప్రతీకారం తీర్చుకునే ఓ వ్యక్తి ప్రయాణాన్ని ఆవిష్కరిస్తూ ఈ కథ సాగుతుందని దర్శకుడు షనీల్ డియో చెప్పారు. ఈ చిత్రాన్ని సుప్రియా యార్లగడ్డ నిర్మిస్తున్నారు.