బాలీవుడ్ చిత్రసీమలో వినూత్న కథా చిత్రాల్ని రూపొందించి ప్రతిభావంతుడైన దర్శకుడిగా పేరు తెచ్చుకున్నారు అనురాగ్‌కశ్యప్. దర్శకత్వంతో పాటు చాలా చిత్రాల్లో తన నటనతో మెప్పించారు. తాజాగా ఆయన విజయ్‌సేతుపతి తమిళ చిత్రం ‘మహారాజ’లో ప్రతి నాయకుడి పాత్రలో కనిపించనున్నారు. ఇందులో విజయ్ సేతుపతి ద్విపాత్రాభినయంలో నటించనున్నారు. రివేంజ్ థ్రిల్లర్‌గా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.
ఈ సినిమాలో అనురాగ్‌కశ్యప్ విలన్‌గా నటిస్తున్నారని తెలిసింది. గతంలో విజయ్‌సేతుపతి నటించిన ‘ఇమైకా నోడిగల్’ చిత్రంలో అనురాగ్‌కశ్యప్ ఓ పాత్రలో కనిపించారు. అప్పటి నుంచే వీరిద్దరి మధ్య చక్కటి స్నేహసంబంధాలున్నాయి. ప్రస్తు తం ఈ సినిమా చిత్రీకరణ జరుగుతున్నది. ఇందులో అనురాగ్‌కశ్యప్ పాల్గొంటున్నారని చెబుతున్నారు. ఈ ఏడాది చివరలో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకురానుంది.