Anupama Parameswaran | కెరీర్ ఎలా మొదలుపెట్టామనేది కాదు.. దాన్ని ఎలా కంటిన్యూ చేస్తున్నామనేది ఇక్కడ ఇంపార్టెంట్. వరుస విజయాలతో ఇండస్ట్రీకి వచ్చినా తర్వాత అదే జోరు చూపించకపోతే ఇక్కడ ఎవరూ పట్టించుకోరు. అనుపమ పరమేశ్వరన్ విషయంలో ఇదే జరుగుతుంది. అఆ, ప్రేమమ్, శతమానం భవతి సినిమాలతో హ్యాట్రిక్ విజయాలు అందుకొని సూపర్ క్రేజ్ తెచ్చుకుంది అనుపమ. అయితే ఆ తర్వాత మాత్రం అదే జోరు కంటిన్యూ చేయడంలో పూర్తిగా విఫలమైంది. దాదాపు రెండు మూడు సంవత్సరాల పాటు వచ్చిన ప్రతి సినిమా ఫ్లాప్ కావడంతో.. తెలుగు ఇండస్ట్రీకి దూరమైపోయింది అనుపమ పరమేశ్వరన్.
అయితే ఈ మధ్య మళ్లీ ఈమెకు మంచి మంచి అవకాశాలు వస్తున్నాయి. దానికి తోడు అందాల ఆరబోతలో కూడా కాస్త ముందడుగు వేసింది అనుపమ పరమేశ్వరన్. ఆ మధ్య దిల్ రాజు వారసుడు ఆశీష్ రెడ్డి హీరోగా వచ్చిన రౌడీ బాయ్స్ సినిమాలో ఏకంగా లిప్ లాక్ సన్నివేశాలతో పాటు బెడ్ రూమ్ సీన్స్ కూడా చేసింది. దాంతో యంగ్ హీరోల కన్ను ఈ ముద్దుగుమ్మ మీద పడింది. వేరే ఆప్షన్ లేక తనకంటే జూనియర్స్ తో కూడా రొమాన్స్ చేయడానికి రెడీ అవుతుంది అనుపమ. ఇలాంటి సమయంలో కార్తికేయ 2 సాధించిన సంచలన విజయంతో పాన్ ఇండియా స్థాయిలో అనుపమకు మంచి గుర్తింపు వచ్చింది. ఈ సినిమా తర్వాత మళ్లీ తన కెరీర్ కు ఊపు వస్తుందని నమ్ముతుంది.
ఈ క్రమంలోనే ఒక్కో అవకాశం అనుపమను వెతుక్కుంటూ వస్తోంది. ప్రస్తుతం నిఖిల్ హీరోగా వస్తున్న 18 పేజెస్ తోపాటు బటర్ ఫ్లై అనే మరో సినిమా కూడా చేస్తుంది ఈ బ్యూటీ. తాజాగా సిద్ధూ జొన్నలగడ్డ డీజే టిల్లు 2 సినిమాలో హీరోయిన్గా ఎంపికైంది. ఇందులో ముందు పెళ్లిసందడి హీరోయిన్ శ్రీ లీలను తీసుకున్నారు. అయితే ఆమె ఇతర సినిమాలతో బిజీగా ఉండటంతో తప్పుకుంది. ఇప్పుడు ఆ అవకాశం అనుపమ పరమేశ్వరన్ కు వచ్చింది. ఇమేజ్ పరంగా తనకంటే తక్కువగా ఉన్న సిద్దుతో రొమాన్స్ చేయడానికి ఒప్పుకుంది అనుపమ. ప్రస్తుతానికి ఇంకో ఆప్షన్ కూడా ఆమె చేతిలో లేదు. అందుకే వచ్చిన ప్రతి సినిమా ఒప్పుకుంటుంది ఈ కేరళ కుట్టి. డీజే టిల్లులో హీరోయిన్‌తో ఫుల్ రొమాన్స్‌తో పాటు లిప్ లాక్ సీన్లు కూడా ఉన్నాయి. మరి దాని సీక్వెల్ ఎలా ఉండబోతుందో..?
“Anupama Parameswaran | పసుపు రంగు చీరలో బంతిపువ్వులా ముద్దొస్తున్న అనుపమ పరమేశ్వరన్..”