ప్రేమమ్ సినిమాతో కోట్లాదిమంది ఫాలోవర్లను సంపాదించుకుంది కేరళకుట్టి అనుపమ పరమేశ్వరన్ (Anupama Parameswaran). ఈ భామ నటించిన కార్తికేయ 2 (Karthikeya 2) తెలుగు, మలయాళంతోపాటు పలు భాషల్లో విడుదలై మంచి టాక్ తెచ్చుకుంది. నిర్మాతలకు కాసుల వర్షం కురిపిస్తోంది. కాగా సినిమా సినిమాకు అందం, అభినయాన్ని రెట్టింపు చేసుకుంటూ ఫ్యాన్ ఫాలోయింగ్‌ను కూడా అదే రేంజ్లో పెంచుకుంటూ వెళ్తోంది అనుపమ.
ఈ బ్యూటీకి సంబంధించిన ఇంట్రెస్టింగ్ వార్త ఇపుడు టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది. తెలుగు, తమిళం, మలయాళ భాషల్లో సినిమాలు చేస్తూ బిజీగా ఉన్న అనుపమ ఇక హిందీ (Bollywood)లో కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు రెడీ అవుతోందట. ముంబై మీడియా సర్కిల్లో వస్తున్న టాక్ ప్రకారం ఓ టాప్ ప్రొడక్షన్ హౌస్ భారీ సినిమాతో హిందీలో లాంఛ్ చేసేందుకు అనుపమను సంప్రదించినట్టు వార్తలు హల్ చల్ చేస్తున్నాయి.
ప్రస్తుతానికి అఫీషియల్ అప్డేట్ ఏమీ రాకున్నా ఈ వార్త మాత్రం సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతోంది. బాలీవుడ్లో దక్షిణాది తారలకు భారీ ఆఫర్లు వస్తున్న ఇలాంటి తరుణంలో అనుపమ బీటౌన్ ఎంట్రీ ఇస్తుండటం పక్కా అయితే మాత్రం ఆమె కెరీర్ యూ టర్న్ తీసుకోవడం ఖాయమంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు.