‘ ‘పరదా’ ఓ ఫిక్షనల్ స్టోరీ. అయితే.. దీనికి ప్రేరణ మాత్రం ఓ రియల్ ఇన్సిడెంట్. అదేంటి అనేది ఇప్పుడే రివీల్ చేస్తే కరెక్ట్ కాదు. మీరు సినిమాలో చూస్తే అది అర్థమవుతుంది.’ అని నిర్మాత విజయ్ డొంకాడ అన్నారు. అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రలో ప్రవీణ్ కాండ్రేగుల దర్శకత్వంలో ఆయన నిర్మించిన ‘పరదా’ చిత్రం ఈ నెల 22న విడుదలకానుంది. ఈ సందర్భంగా మంగళవారం హైదరాబాద్‌లో ఆయన విలేకరులతో ముచ్చటించారు. ‘ఈ కథ విన్నవెంటనే అనుపమ ఓకే చేశారు. రీసెంట్గా ఆమె ఫస్ట్ కాపీ చూసి, తన కెరీర్లోనే ఇది బెస్ట్ మూవీ అంటూ ఎమోషనల్ అయ్యారు.
అందుకే ప్రమోషన్స్ కూడా ఓన్ చేసుకొని చేస్తున్నారు. అలాగే దర్శన, సంగీత పాత్రలు కూడా అద్భుతంగా ఉంటాయి. దుల్కర్ టీమ్ రీసెంట్గా ఈ సినిమా చూశారు. మలయాళంలో ఆయనే రిలీజ్ చేస్తున్నారు.’అని విజయ్ కొండాక తెలిపారు. సురేశ్‌బాబు, రానా ఈ సినిమా చూసి విలువైన సలహాలు ఇచ్చారని, వాళ్ల సజెషన్స్ వల్ల సినిమా ఇంకా బెటర్ అయ్యిందని నిర్మాత విజయ్ చెప్పారు. మనాలి, లడక్, ధర్మశాల, ఢిల్లీ వంటి అద్భుతమైన లొకేషన్స్‌లో సినిమా షూట్ చేశామని, సాంకేతికంగా అన్ని విధాలా సినిమా అద్భుతంగా ఉంటుందని నిర్మాత పేర్కొన్నారు.