Anupama Parameswaran | అనుపమ పరమేశ్వరన్- ధృవ్ విక్రమ్ బ్రేకప్ రూమర్స్.. అసలు నిజమేంటి?
Anupama Parameswaran | మలయాళీ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ మరోసారి సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారారు. ఈ సారి ఆమె సినిమాల కంటే వ్యక్తిగత జీవితానికి సంబంధించిన వార్తలే ఎక్కువగా చర్చనీయాంశమవుతున్నాయి. తమిళ నటుడు ధ్రువ్ విక్రమ్‌తో ఆమె ప్రేమలో ఉన్నారని, ఇప్పుడు ఇద్దరూ విడిపోయారనే ప్రచారం కోలీవుడ్ వర్గాల్లో జోరుగా సాగుతోంది.
Anupama Parameswaran | మలయాళీ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ మరోసారి సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారారు. ఈ సారి ఆమె సినిమాల కంటే వ్యక్తిగత జీవితానికి సంబంధించిన వార్తలే ఎక్కువగా చర్చనీయాంశమవుతున్నాయి. తమిళ నటుడు ధ్రువ్ విక్రమ్‌తో ఆమె ప్రేమలో ఉన్నారని, ఇప్పుడు ఇద్దరూ విడిపోయారనే ప్రచారం కోలీవుడ్ వర్గాల్లో జోరుగా సాగుతోంది. అనుపమ, ధ్రువ్ విక్రమ్ కలిసి నటించిన ‘బైసన్’ సినిమా తర్వాత వీరి మధ్య సాన్నిహిత్యం పెరిగిందని, కొంతకాలంగా ప్రేమలో ఉన్నారనే వార్తలు అప్పట్లో వినిపించాయి. అయితే దీనిపై ఇద్దరూ ఎప్పుడూ అధికారికంగా స్పందించలేదు.
తాజాగా సోషల్ మీడియాలో మరోసారి వీరి గురించి బ్రేకప్ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అనుపమ తన ఇన్‌స్టాగ్రామ్‌లో చేసిన కొన్ని పోస్టులు, అలాగే ధ్రువ్ విక్రమ్‌ను అన్‌ఫాలో చేసినట్లు కనిపించడంతో ఈ ప్రచారానికి మరింత ఊతమిచ్చింది. త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారనే ఊహాగానాల మధ్య ఇలాంటి వార్తలు రావడం అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది.అంతేకాదు, చెన్నైలోని ఓ హోటల్లో ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగిందని, ఆ తర్వాత అనుపమ ధ్రువ్‌తో సంబంధాలను పూర్తిగా ముగించిందంటూ సోషల్ మీడియాలో పలు కథనాలు ప్రచారంలో ఉన్నాయి. అయితే ఈ ఆరోపణలకు సంబంధించి పూర్తి క్లారిటీ లేదు. అయితే రీసెంట్గా అనుపమ తన సోషల్ మీడియా వేదికగా ఇకపై ఎవరి అనుమతి అవసరం లేదు.. ఎలాంటి భయం లేదు అనే భావంతో ఒక పోస్ట్ షేర్ చేయడం కూడా ఈ ప్రచారానికి కారణమైంది. అయితే ఆ పోస్ట్ వ్యక్తిగత జీవితానికే సంబంధించినదా? లేక వేరే సందర్భంలో చేసినదా? అన్న విషయంపై స్పష్టత లేదు.
ప్రస్తుతం అనుపమ పరమేశ్వరన్ లేదా ధ్రువ్ విక్రమ్ ఈ వార్తలపై ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. దీంతో వీరి బ్రేకప్ వార్తలు ఇప్పటికీ ఊహాగానాలుగానే కొనసాగుతున్నాయి. ఇద్దరిలో ఎవరైనా స్పందించిన తర్వాతే అసలు విషయంపై పూర్తి స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Engilipula Batukamma | సందడిగా.. సంప్రదాయబద్ధంగా ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు..!
ఈఎంసిలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
Bathukamma | జపాన్‌లో బతుకమ్మ సంబురాలు.. టోక్యోలో వెల్లివిరిసిన తెలంగాణ సంస్కృతి
Yogi Adityanath | నేను రెడీ, అఖిలేష్ రెడీనా.. యూపీ సీఎం యోగీ అదిత్యనాథ్ ప్రతి సవాల్
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

