Butter Fly Movie | ఓ వైపు గ్లామర్ రోల్స్‌లో మెప్పిస్తూనే.. మరో వైపు నటన ప్రాధాన్యమున్న పాత్రలను చేస్తుంది అనుపమ పరమేశ్వరణ్. ‘అఆ!’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈ కేరళ బ్యూటీ అనతికాలంలో వరుస సినిమాలలో నటిస్తూ టైర్2 హీరోలకు మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ అయింది. ప్రస్తుతం ఈమె చేతిలో నాలుగు సినిమాలున్నాయి. అందులో ‘బటర్‌ఫ్లై’ ఒకటి. లేడీ ఓరింయెంటెడ్ సినిమాగా తెరకెక్కిన ఈ మూవీకి గంటా సతీష్ బాబు దర్శకత్వం వహించాడు. ఇటీవలే విడుదలైన టీజర్ సినిమాపై విపరీతమైన క్యూరియాసిటీని పెంచాయి. సినిమా షూటింగ్ పూర్తయి దాదాపు నెలలు గడుస్తుంది. కానీ ఈ ఏడాది క్యాలెండర్ మెత్తం ఆల్రెడీ బుక్ అయి ఉన్నాయి. ఇక వచ్చే ఏడాది చూసుకుంటే చాలా లేటైయిపోతుందని భావించి నేరుగా ఓటీటీలోనే రిలీజ్ చేయాలని నిర్ణయించుకున్నారట.
తాజాగా చిత్రబృందం ఈ సినిమా ఓటీటీ డేట్‌ను ప్రకటించింది. ప్రముఖ ఓటీటీ సంస్థ డిస్నీ+హాట్‌స్టార్‌లో ఈ చిత్రం డిసెంబర్ 29నుండి స్ట్రీమింగ్ కానుంది. ముందు నుండి థియేటర్లలోనే రిలీజ్ చేయాలని మేకర్స్ భావించారట. అయితే ఓ వైపు థియేటర్ల సమస్య, మరో వైపు నిర్మాతలకు పెరుగుతున్న వడ్డి. ఇక ఇలాంటి టైమ్‌లో హాట్‌స్టార్ నుండి మేకర్స్‌కు ఓ భారీ ఆఫర్. ఎలాగైతే నేం థియేటర్ అయిన, డిజిటల్ అయిన కంటెంట్ బాగుంటే ఆధరిస్తారు అని హాట్‌స్టార్ ఆఫర్‌కు యెస్ చెప్పారట. ఈ చిత్రాన్ని జెన్ నెక్స్ట్ మూవీస్ బ్యానర్‌పై రవిప్రకాష్ బోడపాటి, ప్రసాద్ తిరువళ్ళూరి, ప్రదీప్ నల్లిమెల్లి సంయుక్తంగా నిర్మించారు.