శ్రీరామ్ నిమ్మల, మౌనిక జంటగా నటిస్తున్న చిత్రం ‘అనుకున్నవన్ని జరగవు కొన్ని’. జి.సందీప్ దర్శకుడు. శ్రీభారత సంస్థ నిర్మిస్తున్నది. త్వరలో విడుదలకానుంది. ఇటీవల ట్రైలర్ను విడుదల చేశారు. హీరో శ్రీరామ్ నిమ్మల మాట్లాడుతూ ‘క్రైమ్ కామెడీ థ్రిల్లర్గా వినూత్న కథతో తెరకెక్కించాం. ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగుతుంది. ప్రేక్షకులకు సరికొత్త అనుభూతినందిస్తుంది’ అన్నారు. ఎవరి జీవితంలో కూడా అనుకున్నవన్నీ అంత తేలికగా జరగవనే అంశాన్ని ఆవిష్కరించే చిత్రమిదని దర్శకుడు తెలిపారు. కొత్తదనంతో కూడుకున్న కథలో భాగం కావడం ఆనందంగా ఉందని హీరోయిన్ మౌనిక పేర్కొంది. ఈ చిత్రానికి జీవీ అజయ్ సంగీతాన్నందిస్తున్నారు.