రాజేంద్రప్రసాద్, నరసింహరాజు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా ‘అనుకోని ప్రయాణం’. ఈ చిత్రాన్ని బెక్కెం వేణుగోపాల్ సమర్పణలో ఆపిల్ క్రియేషన్స్ పతాకంపై డా॥ జగన్ మోహన్ డి.వై. నిర్మిస్తున్నారు. వెంకటేష్ పెదిరెడ్ల దర్శకుడు. ఈ చిత్రానికి పరుచూరి సోదరులు డైలాగ్స్ అందించడం విశేషం. చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా త్వరలో విడుదలకు సిద్ధమవుతున్నది. తాజాగా చిత్ర ప్రెస్‌మీట్‌ను హైదరాబాద్‌లో నిర్వహించారు. రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ..‘నా సినీ ప్రయాణంలో కొన్ని కథలు ఆశ్చర్యపరిచాయి. ఈ సినిమా కూడా అలా అవాక్కయ్యేలా చేసింది. కరోనా సమయంలో వలస కూలీల వ్యథల నుంచి పుట్టిన కథ ఇది. ఇద్దరు స్నేహితుల గొప్ప స్నేహాన్ని ఈ చిత్రంలో చూస్తారు’ అని అన్నారు. ‘లాక్ డౌన్లో వాస్తవ ఘటనలు చూసిన స్ఫూర్తితో ఈ కథను రాసుకున్నాను. సినిమాలోని భావోద్వేగాలు ఆకట్టుకుంటాయి. ప్రస్తుతం చిత్రీకరణ పూర్తయింది. త్వరలో విడుదల చేయబోతున్నాం’ అని దర్శకుడు వెంకటేష్ పెదిరెడ్ల అన్నారు.