సినిమా స్టార్స్ తమ సినిమాలని ప్రమోట్ చేసుకునేందుకు బిగ్ బాస్ వేదికను చక్కగా వాడుకుంటున్న విషయం తెలిసిందే. ఇప్పటికే పలు టీంస్ ఈ వేదికపై సందడి చేయగా, రీసెంట్గా అనుభవించు రాజా టీం హాజరయ్యారు. రాజ్ తరుణ్, సుదర్శన్, హీరోయిన్ కశిష్ ఖాన్ రావడంతో ఇల్లంతా సందడిగా మారిపోయింది. ఇందులో బొమ్మలు గీసే టాస్క్ ఇచ్చాడు. రెండు టీంలుగా విడొగొట్టారు.
కంటెస్టెంట్ల పేర్లను చెబితే.. బొమ్మల రూపంలో వారిని గెస్ చేయాలి. అలా ఈ టాస్క్‌లో షన్ను, సిరిలను హగ్స్ రూపంలో ఆనీ మాస్టర్ గీసి చూపించింది. ఇక ఇదే టాస్క్‌లో సుదర్శన్ కొన్ని కౌంటర్లు వేశాడు. బయట ఇంకో ఇద్దరున్నారని గుర్తు పెట్టుకోండని సెటైర్ వేశాడు. అలా ఆ టాస్క్ ఎంతో సరదాగా గడిచింది. ఇక కశీష్ ఖాన్ కోసం తెలుసా మనసా అనే పాటను శ్రీరామచంద్ర పాడాడు. చివరకు అనుభవించు రాజా స్టెప్పులు వేశారు కంటెస్టెంట్లు. అనుభవించు రాజా టీం మొత్తానికి గుడ్ బై చెప్పేసింది.
ఆ తరువాత మైకులో మాట్లాడటం, చప్పట్లు సౌండ్ వస్తే సేఫ్ అయినట్టు అని చెప్పడంతో అందరూ మాట్లాడారు. కానీ మానస్, షన్నులకు మాత్రమే చప్పట్ల సౌండ్స్ వచ్చాయి. దీంతో వారిద్దరూ సేఫ్ అయినట్టు నాగ్ చెప్పేశాడు. ఆ తరువాత డైలాగ్ కొట్టు గురూ అనే టాస్క్ పెట్టాడు. ఇందులో పలువురు పలు రకాల డైలాగ్స్ ఇచ్చుకున్నారు.