అను ఇమ్మాన్యుయేల్, శివ కందుకూరి ప్రధాన పాత్రధారులుగా ఓ చిత్రం తెరకెక్కనున్నది. ఈ సినిమా ద్వారా ప్రముఖ ఛాయాగ్రాహకుడు ఆండ్రూ బాబు దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. లండన్ గణేశ్, డా॥ ప్రవీణ్‌రెడ్డి పూట్ల నిర్మాతలు. ఉత్కంఠను రేకెత్తించే థ్రిల్లర్‌గా ఈ సినిమా రూపొందుతున్నదని, లండన్‌లోని అద్భుతమైన లొకేషన్స్‌తో చిత్రీకరణ జరుగుతున్నదని, వెన్నులో వణుకు పుట్టించేలా ఇందులో సన్నివేశాలు ఉంటాయని మేకర్స్ తెలిపారు. త్వరలో టైటిల్ ప్రకటించనున్న ఈ సినిమాలో వైవా హర్ష, వెన్నెల కిశోర్, ఎస్.నివాసిని, షకలక శంకర్ తదితరులు ఇతర పాత్రధారులు. ఈ చిత్రానికి సంగీతం: అనూప్ రూబెన్స్, కెమెరా, దర్శకత్వం: ఆండ్రూ బాబు, నిర్మాణం: బిగ్ మూవీ మేకర్స్ లిమిటెడ్, మైత్రీ ఆర్ట్స్.