Anu Aggarwal | ‘శంకర్ దాదా ఎంబిబిఎస్’, ‘శంకర్ దాదా జిందాబాద్’ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకి దగ్గరైన పరేష్ రావెల్ గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. ఆయన శంకర్ దాదా ఎంబీబీఎస్ చిత్రంలో ఎంతగా అలరించారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తెలుగులోనే కాకుండా పరేష్ రావల్ హిందీలోను చాలా సినిమాలు చేశారు. అయితే పరేష్ రావల్ ఈ మధ్య ఓ ఇంటర్వ్యూలో షాకింగ్ కామెంట్స్ చేసి హాట్ టాపిక్ అయ్యాడు. తన మోకాలికి గాయం అయ్యిందని, దాని నుంచి కోలుకోవడానికి తాను యూరిన్ తాగినట్టు చెప్పుకొచ్చాడు. బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్ తండ్రి, సీనియర్ స్టంట్ డైరెక్టర్ వీరూ దేవగన్ సలహాతో యూరిన్ తాగినట్లు పరేష్ పేర్కొనగా, ఈ విషయం విని అందరు నోరెళ్లపెట్టారు.
యూరిన్ తాగడం ఆరోగ్యానికి మంచిది కాదని, అలాంటి పని ఎవరు చేయోద్దంటూ వైద్యులు చెప్పుకొచ్చారు. అయితే పరేష్ రావెల్ బాటలో ఇప్పుడు అను అగర్వాల్ నడిచిందట. ఆయన వ్యాఖ్యలకి మద్దతుగా ఈమె చేసిన కామెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యాయి. తాను కూడా యూరిన్ తాగినట్లు హీరోయిన్ అను అగర్వాల్ తెలిపారు. బాలీవుడ్ బ్లాక్ బస్టర్ సినిమా ఆషికి చిత్రం 1990లో విడుదల కాగా, ఆ సినిమాకు ప్రేక్షకులు ఎంతో మంది ఫిదా అయ్యారు. అందులో అను అగర్వాల్ హీరోయిన్. ఈ సినిమాతో ఆమె మంచి పేరు తెచ్చుకుంది.
అయితే తాను యారిన్ తాగడం గురించి మాట్లాడుతూ.. యూరిన్ తాగడం యోగాలో ఒక ముద్ర అని చెప్పుకొచ్చారు. యూరిన్ తాగడం వల్ల ముఖం మీద ముడతలు పోతాయని ఆవిడ పేర్కొన్నారు. చాలా మందికి యూరిన్ తాగడం వల్ల వచ్చే ప్రయోజనాలు తెలియదు. తెలిసినా నిర్లక్ష్యం వహిస్తున్నారో… లేదంటే అవగాహన లేదో తెలియదు కాని యూరిన్ తాగడాన్ని ఆమ్రోలి అంటారు. ఇది యోగాలో ఒక ముద్ర కాగా, దానిని నేను ప్రాక్టీస్ చేశారు. మనం యూరిన్లో కొంత తీసుకుంటే మంచిది. యాంటీ ఏజింగ్ విషయంలో హెల్ప్ అవుతుంది. వ్యక్తిగతంగా నాకు ఆరోగ్య పరంగా ఎంతో ప్రయోజనం చేకూర్చింది” అని చెప్పారు. అయితే వైద్యులు తాగొద్దంటున్నారు కదా అని అడగ్గా.. సైన్స్ ఎప్పటిది? 200 ఏళ్ళు?? యోగా 1000 ఏళ్ల నుంచి ఉంది. మీరు రెండిటిలో దేనిని నమ్ముతారు అని తిరిగి ప్రశ్నించింది.