Ram Charan-NTR| జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ లాంటి ఇద్దరు స్టార్ హీరోలు కలిసి ఒక సినిమా చేస్తారని ఎవరు ఊహించి ఉండరు. కాని దానిని సుసాధ్యం చేశాడు రాజమౌళి. ఆర్ఆర్ఆర్ పేరుతో ఓ అద్భుతాన్ని తెరకెక్కించి ఆ మూవీతో ఆస్కార్ కూడా దక్కేలా చేశాడు.ఈ సినిమా తెలుగు సినిమా ఖ్యాతిని హాలీవుడ్ వరకు తీసుకెళ్లింది. ఇందులో రామ్ చరణ్, ఎన్టీఆర్లు పోటా పోటీగా నటించారు. రామ్ పాత్రలో రామ్ చరణ్, భీమ్ పాత్రలో ఎన్టీఆర్ అదరగొట్టేశారు. ఇక ఈ సినిమా హాలీవుడ్ రేంజ్ లో గ్రామీ అవార్డ్ తో పాటు పలు అవార్డ్లు సాధించింది. కలెక్షన్స్ విషయానికి వస్తే ఏకంగా రూ.1200 కోట్లు రాబట్టింది.
అయితే ఇప్పుడు ఈ ఇద్దరి కాంబినేషన్లో మరో మల్టీస్టారర్ రాబోతుందనే చర్చ జోరుగా నడుస్తుంది.రామ్ చరణ్, ఎన్టీఆర్ కాంబోలో సినిమా అంటే అది ఆర్ఆర్ఆర్ సినిమాకి సీక్వెలా? లేకుంటే వేరే దర్శకుడు వీరిద్దరితో కలిసి పని చేయబోతున్నాడా? ఎప్పుడు సినిమా స్టార్ట్ అవుతుంది వంటి ఆలోచనలు ఎన్నో ఉన్నాయి. అయితే ఇక్కడ విషయం ఏంటంటే వీరిద్దరు కలిసి మరోసారి త్రిపుల్ ఆర్ సినిమానే చేయబోతున్నారట. గతంలో ఆర్ఆర్ఆర్ సినిమా ఇంకా అయిపోలేదని, మూవీకి సీక్వెల్ ఉందని సినిమా రచయిత, రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ గతంలోనే ఓ సందర్భంలో చెప్పారు.
అయితే సీక్వెల్ ఎప్పుడు వర్కవుట్ అవుతుంది అనేది మాత్రం చెప్పలేదు. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో మాత్రం ఈ సినిమా ఇప్పట్లో సెట్స్ మీదకు వెళ్లే పరిస్థితి అయితే కనిపించడం లేదు. అందుకు కారణం జక్కన్న మహేష్ బాబు సినిమాతో బిజీగా ఉండగా, రామ్ చరణ్ బుచ్చిబాబుతో పాటు సుకుమార్ లతో సినిమాలు చేసేందుకు కమిట్ అయ్యాడు. మరోవైపు .. ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ కు కమిట్ అయ్యాడు, ఆతరువాత దేవర2 కూడా లైన్ లో ఉంది. దాదాపు ఐదారేళ్ల వరకు వీళ్ల కాల్షీట్స్ అన్ని బిజీగానే ఉంటాయి. ఐదేళ్ల తర్వాతే వీరి కాంబోలో సినిమా తెరకెక్కనుంది. ఈ ప్రాజెక్ట్ దాదాపు అసాధ్యమే కాని ఏమో చెప్పలేం రాజమౌళి అసాధ్యాన్ని కూడా సుసాధ్యం చేయగలడు కదా.