Antony Varghese | ‘మార్కో’ చిత్రంతో మలయాళంలో బ్లాక్‌బస్టర్ విజయం సాధించిన నిర్మాత షరీఫ్ మొహమ్మద్ తమ తదుపరి ప్రాజెక్ట్‌ను ప్రకటించారు. పాన్-ఇండియా స్థాయిలో రూపొందుతున్న ఈ కొత్త చిత్రం పేరు ‘కట్టాలన్ – ది హంటర్’ (Kattalan – The Hunter). ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను తాజాగా విడుదల చేశారు మేకర్స్. ఈ సినిమాలో ఆంటోనీ వర్గీస్ ప్రధాన పాత్రలో నటించబోతున్నాడు. ఆయన పుట్టినరోజు సందర్భంగా ఈ ఫస్ట్ లుక్‌ను విడుదల చేసింది చిత్రయూనిట్. ఇటీవలే ఈ చిత్రం యొక్క మొదటి షెడ్యూల్ షూటింగ్ థాయ్‌లాండ్‌లో విజయవంతంగా పూర్తయినట్లు చిత్రబృందం తెలిపింది. ఈ చిత్రానికి పాల్ జార్జ్ దర్శకత్వం వహిస్తుండగా, బి.ఎ. జనీష్ లోక్‌నాథ్ సంగీతం అందిస్తున్నారు. ‘కట్టాలన్’ చిత్రాన్ని క్యూబ్స్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై షరీఫ్ మొహమ్మద్ నిర్మిస్తున్నారు. ఈ సినిమా యాక్షన్ సన్నివేశాలకు ప్రత్యేక ప్రాధాన్యతనివ్వబోతున్నారు. ప్రఖ్యాత యాక్షన్ కొరియోగ్రాఫర్ కేచా ఖమ్ఫాక్డీ ఈ చిత్రానికి ఫైట్స్ కంపోజ్ చేస్తున్నారు. ‘ఓంగ్ బాక్ 2’, ‘బాహుబలి 2’, ‘జవాన్’ వంటి పెద్ద చిత్రాలకు ఆయన పనిచేశారు. ‘కట్టాలన్’ చిత్రం మలయాళం, హిందీ, తమిళం, తెలుగు మరియు కన్నడ భాషల్లో విడుదల కాబోతుంది.
‘MARCO’ PRODUCER SHAREEF MUHAMMED’S NEXT IS PAN-INDIA FILM ‘KATTALAN’ – FIRST LOOK POSTER UNVEILED… Following the #Blockbuster success of #Marco, producer #ShareefMuhammed has revealed the #FirstLook poster of his upcoming film, #Kattalan – The Hunter.
The poster launch… pic.twitter.com/cO1jHfNV2E
— taran adarsh (@taran_adarsh) October 11, 2025