జోజు జార్జ్, ఉష, చెంబన్ వినోద్ జోస్, కల్యాణి ప్రియదర్శన్, ఆశ శరత్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న మలయాళ చిత్రం ‘ఆంటోని’. జోషి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా ఇటీవల కొచ్చిలో లాంఛనంగా ప్రారంభమైంది. ‘దర్శకుడు జోషి, జోజు జార్జ్ కలయికలో వచ్చిన ‘పోరింజు మరియం జ్యూస్’ అనే చిత్రం ఇటీవల విడుదలై మలయాళంలో భారీ విజయాన్ని సాధించింది.
ఈ సినిమాలో జోజు పోషించిన కట్టలన్ పోరింజు పాత్ర చాలా పాపులర్ అయింది. మరలా ఈ కాంబినేషన్ రిపీట్ కావడంతో ఈ సినిమాపై దక్షిణాదిలో అంచనాలు పెరిగాయని నిర్మాత జాక్పాల్ పేర్కొన్నారు. కమర్షియల్ ఎంటర్టైనర్ ఇదని దర్శకుడు తెలిపారు. ఈ చిత్రానికి కెమెరా: రణదివే, సంగీతం: జేక్స్ బిజోయ్, రచన: రాజేష్ వర్మ, దర్శకత్వం: జోషి.