Ante Sundaraniki Trailer Update | ఫలితం ఎలా ఉన్నా ప్రేక్షకులకు కొత్త కథలను చూపించాలని అనుకునే అతికొద్ది మంది నటులలో నాని ఒకడు. ఈయన నుంచి సినిమా వస్తుందంటే ప్రేక్షకులు కూడా ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తుంటారు. రొటీన్‌కు భిన్నంగా కథలను ఎంచుకుంటూ మినిమమ్ గ్యారెంటీ హీరోగా టాలీవుడ్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం ఈయన హీరోగా నటించిన లేటెస్ట్ చిత్రం ‘అంటే సుందరానికీ’. ‘బ్రోచేవారెవరురా’ ఫేం వివేక్ ఆత్రేయా దర్శకత్వం వహించాడు. ఈ చిత్రంపై ప్రేక్షకులలో మొదటి నుంచి భారి అంచనాలు ఉన్నాయి. రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ చిత్రం జూన్ 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో చిత్రబృందం తరచూ ఒక అప్డేట్తో ప్రేక్షకులను అలరిస్తుంది. తాజాగా మరో అప్డేట్ను మేకర్స్ ప్రకటించారు.
తాజాగా చిత్రబృందం బిగ్ అప్డేట్ను ప్రకటించింది. అందరూ ఎంతగానో ఎదురు చూస్తున్న ఈ చిత్ర ట్రైలర్ అప్డేట్ను మే30 ఉదయం 11.07 నిమిషాలకు ప్రకటించనున్నట్లు మేకర్స్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఇటీవలే విడుదలైన టీజర్‌కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. ఈ చిత్రంలో నానికి జోడీగా నజ్రియా హీరోయిన్గా నటించింది. నజ్రియా తెలుగులో నటించిన మొదటి చిత్రం ఇదే కావడం విశేషం. ఈ చిత్రంలో నాని బ్రహ్మణుడి పాత్రలో నటించగా, నజ్రియా క్రిస్టియన్ అమ్మాయిగా నటించింది. మైత్రీ సంస్థ నిర్మించిన ఈ చిత్రానికి వివేక్ సాగర్ సంగీతం అందించాడు. ఈ చిత్రం తెలుగుతో పాటు తమిళం, మలయాళ భాషల్లో ఏకకాలంలో విడుదల కానుంది.
Team is super excited 🙂 #AnteSundaraniki#AdadeSundara#AhaSundara pic.twitter.com/x6Y2P5ZAsn
— Nani (@NameisNani) May 28, 2022