Ante Sundaraniki Trailer | ఫలితంతో సంబంధంలేకుండా ప్రేక్షకులకు కొత్త కథలను చూపించాలనుకునే అతికొద్ది మంది నటులలో నాని ఒకడు. ఈయన నుంచి సినిమా వస్తుందంటే అభిమానులే కాదు ప్రేక్షకులు కూడా ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తుంటారు. రొటీన్‌కు భిన్నంగా కథలను ఎంచుకుంటూ మినిమమ్ గ్యారెంటీ హీరోగా టాలీవుడ్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం ఈయన హీరోగా నటించిన లేటెస్ట్ చిత్రం ‘అంటే సుందరానికీ’. ‘బ్రోచేవారెవరురా’ ఫేం వివేక్ ఆత్రేయా దర్శకత్వం వహించాడు. ఈ చిత్రంపై ప్రేక్షకులలో మొదటి నుంచి భారి అంచనాలు ఉన్నాయి. చిత్రం నుంచి విడుదలై ప్రచార చిత్రాలు టీజర్ ప్రేక్షకులలో అంచనాలను రెట్టింపు చేశాయి. రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ చిత్రం జూన్ 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో చిత్రబృందం తరచూ ఒక అప్డేట్తో ప్రేక్షకులను అలరిస్తుంది. తాజాగా మేకర్స్ ఈ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు.
‘నాకు పెద్ద కోరికలేం లేవండి.. నేను కూడా ఒక సారి అమెరికాకు వెళ్ళి అక్కడున్న ఫ్రెండ్స్‌కు ఫోన్ చేసి.. నేను కాలీఫోర్నియాలో ఉన్నాను ఇక్కడ వర్షాలేంట్రాబాబు ఓ మై గాడ్ అని ఒక్కసారి మాట్లాడితే చాలండి.. స్టైలిష్‌గా’ అంటూ నాని పలికే సంభాషణలు తన డ్రీమ్ ఏంటో తెలుపుతుంది. అమెరికా వెళ్ళాలని నాని ఇంట్లో అడుగగా ‘అస్సలు ఒప్పుకోను.. అసలు విశ్వనాధ శాస్త్రీగారి మనవడు, ఉన్న ఒక్కగానోక్క వంశోద్ధారకుడు సముద్రాలేలా దాటుతాడు’ అంటూ నరేశ్ డైలాగ్స్ ఆకట్టుకుంటున్నాయి. ‘నా జీవితానికి మా నాన్న, బామ్మ వీళ్ళందరు సరిపోరన్నట్టు ఈ లిస్ట్‌లోకి కొత్త క్యాండెట్ వచ్చింది’ అంటూ నజ్రియా పరిచయమవుతుంది. ‘కార్లా.. వరల్డ్స్ ఫస్ట్ ఫీమేల్ ఫోటోగ్రాఫర్ తను ఫస్ట్ తీసిన ఫోటో ఎక్కడో తెలుసా.. అందుకే నా పెళ్ళి అక్కడే చేసుకుందామనుకుంటున్నా’ అంటూ నజ్రియా డైలాగ్స్ ఆకట్టుకుంటున్నాయి. ట్రైలర్ మధ్యలో ‘చిన్నకళ్ళతో పెద్ద చూపు చూడాలి కాని.. పెద్ద కళ్ళతో చిన్న చూపు చూడకూడదు’ అంటూ పృథ్వి చెప్పే డైలాగ్ హస్యాస్పదంగా ఉన్నాయి.
ఇటీవలే విడుదలైన టీజర్‌కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. ఈ చిత్రంలో నానికి జోడీగా నజ్రియా హీరోయిన్గా నటించింది. నజ్రియా తెలుగులో నటించిన మొదటి చిత్రం ఇదే కావడం విశేషం. ఈ చిత్రంలో నాని బ్రహ్మణుడి పాత్రలో నటించగా, నజ్రియా క్రిస్టియన్ అమ్మాయిగా నటించింది. మైత్రీ సంస్థ నిర్మించిన ఈ చిత్రానికి వివేక్ సాగర్ సంగీతం అందించాడు. ఈ చిత్రం తెలుగుతో పాటు తమిళం, మలయాళ భాషల్లో ఏకకాలంలో విడుదల కానుంది.