‘కస్తూరి పూర్ణ వెంకట శేష సాయి పవన రామ సుందర ప్రసాద్ గమ్మత్తైన యువకుడు. ఎరుపు రంగు చొక్కా, పంచెకట్టులో సంప్రదాయబద్దంగా కనిపిస్తున్న అతడి కథేమిటో తెలియాలంటే వేసవి వరకు ఆగాల్సిందే’ అంటున్నారు వివేక్ ఆత్రేయ. ఆయన దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘అంటే సుందరానికి’. నాని, నజ్రియా నజీమ్ జంటగా నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేని, వై.రవిశంకర్ నిర్మిస్తున్నారు. న్యూఇయర్ సందర్భంగా శనివారం నాని ఫస్ట్‌లుక్ పోస్టర్‌తో పాటు వీడియోను విడుదలచేశారు. ప్రవరశ్లోకం చదువుతూ నాని తన పూర్తి పేరును చెప్పడం వీడియోలో ఆకట్టుకుంటున్నది. సుందర్ ప్రపంచంలోకి స్వాగతం అనే క్యాప్షన్ ఆసక్తిని పంచుతుంది. వినోదభరిత కథాంశంతో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని వేసవిలో విడుదల చేయబోతున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. నాని కెరీర్లో మరో వైవిధ్యమైన సినిమాగా నిలుస్తుందని పేర్కొన్నారు. హర్షవర్ధన్, రాహుల్ రామకృష్ణ, సుహాస్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: వివేక్ సాగర్, సినిమాటోగ్రఫీ: నికేత్ బొమ్మి.