Anshula Kapoor | బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ సోదరి అన్షులా కపుర్ గుడ్ న్యూస్ పంచుకుంది. ఆమె తన లాంగ్ టర్మ్ బాయ్ ఫ్రెండ్‌తో ఎంగేజ్మెంట్ జరుపుకున్నట్టు తెలియజేసి అందుకు సంబంధించిన పిక్స్ కూడా షేర్ చేసింది. ఇవి ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ జంటకి ప్రతి ఒక్కరు కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. న్యూయార్క్ నగరంలోని ప్రఖ్యాత సెంట్రల్ పార్క్‌లోని బెల్వెడేర్ క్యాసిల్ ముందు అన్షులాకి ప్రపోజ్ చేస్తూ రింగ్ తొడిగాడు రోహన్.
యాప్ ద్వారా ఇద్దరి మధ్య ప్రేమ చిగురించిందని అన్షులా చెప్పుకొచ్చింది.మాది మూడేళ్ల ప్రేమ అని తన లవ్ స్టోరీ తెలియజేసింది. మై బెస్ట్ ఫ్రెండ్.. మై సేఫ్ ప్లేస్.. మై పర్సన్ అంటూ ఎమోషనల్‌గా కామెంట్ చేసింది. ఈ జంటకి అర్జున్, జాహ్నవీ, ఖుషి కపూర్లతో సహా సినీ ప్రముఖులు అభినందిస్తున్నారు. అన్షులా జాన్వీ కపూర్‌కి కజిన్ సిస్టర్ అవుతుంది. అర్జున్ కపూర్‌కి సొంత సోదరి.
రోహన్ ఒక స్క్రిప్ట్‌రైటర్‌గా పనిచేస్తున్నాడు. ప్రస్తుతం Disney+ Dharamatic సహా అనేక ప్రాజెక్ట్స్‌లో కొనసాగుతున్నాడు. UCLA & న్యూ యార్క్ ఫిల్మ్ అకాడమీ నుండి ఫిల్మ్ మాస్టర్స్ పూర్తి చేశారు . త్వరలో ఈ ఇద్దరు పెళ్లి పీటలు ఎక్కనుండగా, వారి పెళ్లి ధూమ్ ధామ్ చేయనున్నట్టు తెలుస్తుంది.