ANR|అప్పటి సీనియర్ హీరోలు ఎన్టీఆర్, ఏఎన్ఆర్ తెలుగు సినిమా ఖ్యాతిని పెంచడంతో ముఖ్య భూమిక పోషించారనే విషయం మనకు తెలిసిందే. ఎన్టీఆర్ ఒక జానర్లో సినిమాలు చేసుకుంటూ పోతూ ఉంటే, ఏఎన్ఆర్ మరో జానర్లో సినిమాలు చేసి ప్రేక్షకులని అలరించారు. తెలుగు సినిమా చరిత్ర అంటే ముందుగా గుర్తొచ్చేది ఎన్టీఆర్ , ఎన్నాఆర్ పేర్లే .. ఒక రైతు కుటుంబంలో పుట్టి, నాటకరంగం ద్వారా వెండితెర వైపు అడుగులేసిన నాగేశ్వరరావు తన కెరీర్లో విలనిజం పండించలేకపోయారు. అందరు హీరోలు ఒక్కసారైన ప్రతినాయకుడి పాత్ర పోషించిన నాగేశ్వరరావు మాత్రం ఆ పాత్ర పోషించడానికి నిరాకరించేవారట.
ఆ నాటి సీనియర్ నటుల్లో ఎన్టీఆర్, కృష్ణం రాజు, జగ్గయ్య, కాంతారావు, సీహెచ్ నారాయణ రావు, ఎల్వీ ప్రసాద్ ఇలా చాలా మంది నటులు హీరోలుగా రాణిస్తూనే కొన్ని సందర్భాలలో విలనిజం ప్రదర్శించారు. హీరోయిన్స్ సావిత్రి, షావుకారు జానకి, అంజలీ దేవీ, భానుమతి, జమున, జి.వరలక్ష్మీ, ఎన్. వరలక్ష్మీలాంటి వారంతా ఇటు హీరోయిన్లుగానూ, అటు సెలక్టడ్ పాత్రల్లోనూ నటించి మెప్పించారు. అయితే అక్కినేని నాగేశ్వరరావు మాత్రం అస్సలు అటువైపు ఆసక్తి చూపలేదు. ఎంతమంది దర్శక నిర్మాతలు అడిగిన కూడా నో చెప్పారు. అందుకు కారణం కూడా ఓ సారి చెప్పుకొచ్చారు.
నా పర్సనాలిటీ, గొంతు నెగిటివ్ పాత్రలకు అస్సలు సెట్ కావు. వాస్తవానికి రెండు రకాల పాత్రల్లో నటించాలంటే కేవలం నటన ఒక్కటే వస్తే సరిపోదు. శరీరాకృతి, ముఖాకృతి, గొంతు కూడా విలన్ పాత్రలకి సరిపోయేలా ఉండలనేది నా అభిప్రాయం అని చెప్పేవారు. అయితే సినిమాలపై ఆయనకున్న అభిమానం కారణంగా చివరి శ్వాస వరకూ నటిస్తూనే ఉన్నారు. 90ఏళ్ల వయసులోనూ కుమారుడు అక్కినేని నాగార్జున, మనవళ్లు అక్కినేని నాగచైతన్య, అక్కినేని అఖిల్‌లతో కలిసి ‘మనం’ సినిమాలో చివరిగా నటించిన అక్కినేని 2014 జనవరి 22లోక్యాన్సర్తో కన్నుమూశారు.. దాదాపు 75 ఏళ్ల పాటు ఆయన సినీ రంగానికి సేవలందించారు.తెలుగు సినిమాను చెన్నై నుంచి హైదరాబాద్ కు తీసుకురావడంలో కీలక పాత్ర పోషించారు ఏఎన్ఆర్.