Akkineni Nageswara Rao | దివంగత నటులు అక్కినేని నాగేశ్వరరావు (Akkineni Nageswara Rao) శత జయంతి అక్కినేని కుటుంబం గ్రాండ్‌గా ప్లాన్ చేస్తున్న విషయం తెలిసిందే. ఏఎన్ఆర్ @100 పేరిటా చేపట్టనున్న ఈ వేడుకలలో ఆయన అభిమానులు కోసం అక్కినేని నాగేశ్వరరావు (ANR Centenary Celebrations) నటించిన పది ఆణిముత్యాలు లాంటి బ్లాక్ బస్టర్స్ సినిమాలను థియేట్రికల్ రీ రిలీజ్ చేయబోతున్నట్లు తెలిపారు. అయితే ఈ పది సినిమాలను ఈ నెల 20 నుంచి 22 వరకు 25 నగరాల్లో రీ రిలీజ్ చేయనున్నట్లు నాగార్జున ప్రకటించారు.
ఫిలిం హెరిటేజ్ ఫౌండేషన్, ఎన్ఎఫ్డీసీ, నేషనల్ ఫిలిం ఆర్చీవ్స్ అఫ్ ఇండియా, పీవీఆర్ ఐనాక్స్‌తో కలసి అన్నపూర్ణ స్టూడియోస్ ఈ ఈవెంట్‌ను ఘనంగా ప్లాన్ చేస్తుంది. అయితే రీ రిలీజ్ అయ్యే సినిమాల లిస్ట్ చూసుకుంటే దేవదాసు’, ‘మిస్సమ్మ’, ‘మాయా బజార్’, ‘భార్యా భర్తలు’, ‘గుండమ్మ కథ’, ‘డాక్టర్ చక్రవర్తి’, ‘సుడిగుండాలు’, ‘ప్రేమ్ నగర్’, ‘ప్రేమాభిషేకం’ ఉన్నాయి. అక్కినేని శత జయంతి సందర్భంగా నాగార్జున ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టాడు.
మా నాన్నగారి 100వ జయంతిని దేశవ్యాప్తంగా ఆయన ల్యాండ్‌మార్క్ సినిమాలతో ఫిలిం హెరిటేజ్ ఫౌండేషన్ జరుపుతుండటం ఆనందంగా ఉంది. మన రాష్ట్రంలో తెలుగు చిత్ర పరిశ్రమకు తొలి పునాది వేసి అన్నపూర్ణ స్టూడియోస్‌ను స్థాపించి మార్గ దర్శకునిగా నిలిచారు. ఆయన లెగసీని కొనసాగించడం మాకు గర్వంగా వుంది. అతని 10 క్లాసిక్ సినిమాలు 25 నగరాల్లో విడుదలవుతున్నాయి. ఈ పండగను సాధ్యం చేయడంలో మాతో భాగస్వామ్యం అయినందుకు అక్కినేని కుటుంబం మొత్తం ఎన్ఎఫ్డీసీ–ఎన్ఎఫ్ఎఐ, పీవీఆర్–ఐనాక్స్కి ధన్యవాదాలు అని నాగార్జున రాసుకోచ్చారు.
The Akkineni family is extremely excited that the Film Heritage Foundation is celebrating the 100th birthday of Sri Akkineni Nageswara Rao our dear father across the country. 10 of his classic films are releasing in 25 cities. He was a pioneer for the Telugu Film Industry laying… pic.twitter.com/uhm75rHjxm
— Nagarjuna Akkineni (@iamnagarjuna) September 6, 2024