తిరువనంతపురం : మళయాళ నటుడు, నిర్మాత విజయ్ బాబుపై ఇటీవల ఓ మహిళ లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన క్రమంలో తాజాగా మరో మహిళ విజయ్ బాబు తనను వేధించాడనే ఆరోపణలతో ముందుకొచ్చింది. విజయ్ బాబు ఓ సమావేశంలో తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని మీటూ కేరళ ఇన్స్టాగ్రాం పోస్ట్‌లో ఆమె రాసుకొచ్చింది.
అతడితో తనకు కేవలం 20-30 నిమిషాల పరిచయమే ఉన్నా తనను ముద్దు పెట్టుకునేందుకు ప్రయత్నించాడని తెలిపింది. ఈ ఘటనతో కలతచెందిన తాను సినీ పరిశ్రమకు దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకునేలా చేసిందని పేర్కొంది.
నటుడు విజయ్ బాబు మద్యం సేవించి తనను కూడా తీసుకోవాలని కోరగా తాను నిరాకరించానని గుర్తుచేసుకుని తన పనిలో నిమ్నగమయ్యానని గుర్తుచేసుకుంది. ఆపై తన ఆమోదం లేకుండానే తనను ముద్దుపెట్టుకునేందుకు దగ్గరకు రాగా తాను వెనక్కి జరిగానని చెప్పింది. తాను కోపంగా అతడి ముఖం వైపు చూడగా కేవలం ఓ ముద్దు ఇవ్వాలని అడిగాడని ఇన్‌స్టా పోస్ట్‌లో ప్రస్తావించింది.