Mohan babu | టాలీవుడ్ మంచు మోహన్ బాబు (Mohan babu) ఫ్యామిలీ వార్ సినీ, రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారిందని తెలిసిందే. తాజా పరిణామాల నేపథ్యంలో మోహన్ బాబు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారంటూ వార్తలు వచ్చాయి. దీనిపై మోహన్ బాబు స్పందిస్తూ.. తాను ఎక్కడికీ పారిపోలేదని.. ఇంట్లోనే వైద్య సంరక్షణలో ఉన్నట్లు స్పష్టం చేస్తూ ఎక్స్‌లో ట్వీట్ కూడా చేశారు. కాగా మోహన్ బాబు కేసులో ట్విస్ట్ నెలకొన్నట్టు మరో న్యూస్ హాట్ టాపిక్‌గా మారింది.
విచారణ టైంలో తన గన్ అప్పగిస్తానని మోహన్ బాబు చెప్పారన్న పోలీసులు.. ఆయన గన్ను సీజ్ చేసేందుకు యత్నించినట్టు తెలుస్తోంది. తాజాగా ఆయన కుటుంబసభ్యులు మాత్రమే అందుబాటులోకి వచ్చారని.. మోహన్ బాబు ఎక్కడున్నారో సమాచారం లేదని చెబుతున్నారు పోలీసులు. ఈ కేసులో మోహన్ బాబు స్టేట్మెంట్ తీసుకోలేదని పోలీసులు చెప్పడం.. మరోవైపు రెండు రోజుల్లో వస్తానని మోహన్ బాబు చెప్పడం సర్వత్రా ఉత్కంఠ రేకెత్తిస్తోంది.
మోహన్ బాబుపై హత్యాయత్నం కేసు..
దాడి ఘటనలో మోహన్ బాబుపై ఇప్పటికే హత్యాయత్నం కేసు కూడా నమోదైంది. తొలుత ఈ కేసులో పోలీసులు మోహన్ బాబు స్టేట్మెంట్ రికార్డు చేయనున్నారని.. ఆయన ఆయుధాన్ని కూడా సీజ్ చేయనున్నారని వార్తలు తెరపైకి వచ్చాయి. జల్పల్లిలోని నివాసం వద్ద ఓ మీడియా ప్రతినిధిపై దాడి ఘటనలో మొదట ఆయనపై బీఎన్ఎస్ 118(1) సెక్షన్ కింద కేసు నమోదు చేసిన పోలీసులు.. లీగల్ ఒపీనియన్ తీసుకున్న తర్వాత 109 సెక్షన్ కింద కేసు రిజిస్టర్ చేసి.. హత్యాయత్నం కేసుగా మార్చారు.
అయితే ఈ కేసుకు సంబంధించి హైకోర్ట్‌లో మోహన్ బాబు ముందస్తు బెయిల్ పిటిషన్‌ను దాఖలు చేసిన విషయం తెలిసిందే. పోలీసులు తదుపరి దర్యాప్తు చేపట్టకుండా ఆదేశాలు ఇవ్వాలని ఈ పిటిషన్లో పేర్కొన్నాడు. కాగా.. ఈ పిటిషన్‌ను శుక్రవారం విచారించిన ధర్మాసనం పోలీసులు తదుపరి దర్యాప్తు చేపట్టకుండా, అరెస్టు చేయకుండా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలన్న మోహన్ బాబు అభ్యర్థనను తిరస్కరించింది. అలాగే ఈ పిటిషన్‌కు సంబంధించి విచారణను గురువారానికి వాయిదా వేసింది.
Ghaati | అనుష్క-క్రిష్ ఘాటి టీం ఎక్జయిటింగ్ అనౌన్స్మెంట్ టైం ఫిక్స్
Vishnu Manchu | హాలీవుడ్ స్టార్ విల్స్మిత్తో మంచు విష్ణు.. క్రేజీ వార్త వివరాలివే..!