రాబోయే సంక్రాంతి (Sankranthi Movies 2023)కి బాక్సాఫీస్ వద్ద సందడి చేసేందుకు టాలీవుడ్ సినిమాలు రెడీ అవుతున్నాయి. ఇప్పటికే భారీ ప్రాజెక్టులు మెగాస్టార్ చిరంజీవి టైటిల్ రోల్ చేస్తున్న వాల్తేరు వీరయ్య, నందమూరి బాలకృష్ణ నటిస్తోన్న వీరసింహారెడ్డి, తమిళ చిత్రాలు వారిసు , తునివు సంక్రాంతి రేసులో ఉన్నాయి. కాగా తాజాగా మరో సినిమా ఈ జాబితాలో చేరిపోయింది. అయితే ఈ సారి రేసులోకి వచ్చింది మాత్రం చిన్న సినిమా.
రాహుల్ విజయ్, శివానీ రాజశేఖర్ లీడ్ రోల్స్ లో నటిస్తున్న చిత్రం విద్యా వాసుల అహం (Vidya Vasula Aham). ఇప్పటికే విడుదలైన కూల్ పోస్టర్ ఫీ మేల్ లీడ్ క్యారెక్టర్ మేల్ క్యారెక్టర్‌పై ఎలా ఆధిపత్యం చెలాయిస్తుందో చెబుతూ.. సినిమాపై క్యూరియాసిటీ పెంచుతోంది. ఈ చిత్రాన్ని జనవరి 14న విడుదల చేస్తున్నారు. తెల్లవారితే గురువారం ఫేం మణికాంత్ గిల్ ఈ మూవీని డైరెక్ట్ చేస్తున్నాడు.
ఎటర్నిటీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై లక్ష్మి నవ్య మక్కపాటి-రంజిత్ కుమార్ కొడాలి సంయుక్తంగా తెరకెక్కిస్తున్నారు. కల్యాణి మాలిక్ ఈ ప్రాజెక్ట్‌కు సంగీతం అందిస్తున్నాడు. వీరసింహారెడ్డి (Veera Simhareddy) జనవరి 12న విడుదలవుతుండగా.. వాల్తేరు వీరయ్య (Waltair Veerayya) జనవరి 13న విడుదలవుతుంది. ఈ రెండు భారీ చిత్రాలతో పోటీగా జనవరి 14న విడుదల చేస్తూ టాక్ ఆఫ్ ది టౌన్‌గా నిలుస్తున్నారు మేకర్స్. మరి విద్యా వాసుల అహం చిత్రం సంక్రాంతి పోటీలో నెగ్గుతుందా..? అనేది చూడాలంటున్నారు సినీ జనాలు.
Read Also : Waltair Veerayya | చిరంజీవి వాల్తేరు వీరయ్య రిలీజ్ డేట్ ఫైనల్.. పోస్టర్ వైరల్
Read Also : Gayathrie Shankar | విక్రమ్ నటి గాయత్రి శంకర్‌కు అరుదైన అవార్డు
Read Also : SSMB28 | ముంబైలో డిన్నర్.. దుబాయ్‌కు ఎస్ఎస్ఎంబీ 28 టీం