కోలీవుడ్‌లో ఉన్న టాలెంటెడ్ హీరోయిన్లలో గాయత్రి శంకర్ (Gayathrie Shankar) ఒకరు. మల్టీ స్టారర్ ప్రాజెక్ట్ విక్రమ్ చిత్రంలో విజయ్ సేతుపతి భార్య పాత్రలో నటించింది గాయత్రి. ఈ బ్యూటీ ఉత్తమ నటి అవార్డుకు ఎంపికైంది. న్యూయార్క్ మూవీ అవార్డ్స్ (New York Movie Awards) మామనిథన్ చిత్రానికిగాను గాయత్రికి ఉత్తమ నటి అవార్డును ప్రకటించింది.
శీను రామస్వామి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో విజయ్ సేతుపతి హీరోగా నటించాడు. తమ టీం మెంబర్‌కు అరుదైన పురస్కారం రావడం పట్ల అటు విక్రమ్, ఇటు మామనిథన్ బృందం హర్షం వ్యక్తం చేస్తోంది. ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది గాయత్రి శంకర్. ప్రతిష్టాత్మక న్యూయార్క్ మూవీ అవార్డు అందుకోబోతున్న గాయత్రి శంకర్‌కు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు టీం.
Read Also : Waltair Veerayya | చిరంజీవి వాల్తేరు వీరయ్య రిలీజ్ డేట్ ఫైనల్.. పోస్టర్ వైరల్
Read Also : SSMB28 | ముంబైలో డిన్నర్.. దుబాయ్‌కు ఎస్ఎస్ఎంబీ 28 టీం
Read Also : Easwari Rao | మా కెమిస్ట్రీ చాలా ఎమోషనల్‌గా సాగుతుంది..ప్రభాస్ సలార్ అప్డేట్