RRR నుంచి సర్ ప్రైజ్.. మళ్లీ దాని గురించేనా..?

RRR Release date | కొన్ని రోజుల కిందటి వరకు కూడా రాజమౌళి తెరకెక్కిస్తున్న ట్రిపుల్ ఆర్ సినిమా నుంచి ఏదైనా అప్డేట్ వస్తే పండుగ చేసుకునేవాళ్లు అభిమానులు. కానీ మెల్లమెల్లగా ఆ సినిమా నుంచి ఎలాంటి అప్డేట్ వచ్చినా కూడా ముందులా స్పందించడం తగ్గించేశారు. ఎందుకంటే ప్రతిసారి మాట ఇచ్చి తప్పడం రాజమౌళికి అలవాటుగా మారిపోయింది. ఆయన తన సినిమా పర్ఫెక్షన్ కోసమే సమయం తీసుకున్నాడు.. అందులో ఎలాంటి తప్పు లేదు.. కానీ అభిమానులకు మాత్రం ఈ సినిమా కోసం ఎదురుచూసి చూసి కళ్లు కాయలు కాస్తున్నాయి. దాంతో తమ సినిమా గురించి అప్డేట్స్ చెప్తాం అని అనౌన్స్ చేసిన ప్రతిసారి.. ఎంతో ఆనందంగా ఫీల్ అయ్యారు. కానీ చెప్పిన ప్రతిసారి మాట తప్పుతుంటే అభిమానులకు కూడా కోపం వస్తుంది.
అందుకే ఈసారి ట్రిపుల్ ఆర్ సినిమా నుంచి అప్డేట్ వస్తుందని తెలిసినా కూడా పెద్దగా స్పందించడం లేదు. ఎందుకంటే అందులో రిలీజ్ డేట్ గురించి చెబుతాడు.. కానీ సినిమా రిలీజ్ చేయరు అంటూ సోషల్ మీడియాలో కామెంట్ చేస్తున్నారు. అక్టోబర్ 13న విడుదల కావాల్సిన ఈ సినిమా మరోసారి వాయిదా పడిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పటి వరకు కొత్త రిలీజ్ డేట్‌పై ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు రాజమౌళి. ఇప్పుడది చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా నుంచి ఒక కొత్త పోస్టర్ విడుదల చేయబోతున్నారు. అందులోనే విడుదల తేదీపై కూడా క్లారిటీ ఇవ్వబోతున్నారు. ఈ సినిమా క్రిస్మస్ లేదంటే సంక్రాంతి కానుకగా విడుదల చేయాలని చూస్తున్నారు.
ఇప్పటికే క్రిస్మస్కు అల్లు అర్జున్ పుష్ప.. సంక్రాంతికి నాలుగైదు సినిమాలు రెడీగా ఉన్నాయి. అలాంటిది రాజమౌళి సడన్‌గా రేస్‌లోకి వస్తే మిగిలిన వాళ్లకు చుక్కలు తప్పవు. మొత్తానికి రాజమౌళి ట్రిపుల్ ఆర్ సినిమా నుంచి ఇవ్వబోయే ఆ సర్ప్రైజ్ ఏంటో మరికొన్ని రోజుల్లో తేలనుంది. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పూర్తి అయిపోయింది. పోస్ట్ ప్రొడక్షన్ కూడా అక్టోబర్ మూడోవారం నాటికి పూర్తవుతుందని రాజమౌళి క్లారిటీ ఇచ్చాడు. ఇక కేవలం ప్రమోషన్ చేసుకొని సినిమాను విడుదల చేసుకోవడమే తరువాయి. దేశవ్యాప్తంగా థియేటర్స్ అన్నీ పూర్తిగా తెరుచుకున్న తర్వాత ట్రిపుల్ ఆర్ సినిమాను విడుదల చేయనున్నారు. దాదాపు 700 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ ఈ సినిమాకు జరుగుతుంది అనే ప్రచారం జరుగుతుంది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒంటరి అవుతున్నాడా..?
Dil Raju | సినీ పరిశ్రమను వివాదాల్లోకి లాగొద్దు: దిల్ రాజు
‘మా’ రాజకీయ వేదిక కాదు.. ప్రకాశ్ రాజ్‌పై నరేశ్ ఫైర్
ఆ ముద్దు సన్నివేశం గురించి సాయిపల్లవి ఏమన్నదంటే..?
ప్లాస్టిక్ సర్జరీలు చేయించుకున్న హీరోయిన్లు వీళ్లే..
మోహన్ బాబును దొంగ నా కొడుకు అని తిట్టిన స్టార్ హీరో ఎవరు..?
RRR Release date
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

