Leo | దళపతి విజయ్ (Vijay) కాంపౌండ్ నుంచి వస్తున్న క్రేజీ చిత్రం లియో (Leo.. Bloody Sweet). లోకేశ్ కనగరాజ్ (Lokesh Kanagaraj) దర్శకత్వంలో యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతోంది. ఇప్పటికే మేకర్స్ లాంఛ్ చేసిన లియో టైటిల్ ప్రోమో గ్లింప్స్ వీడియోతోపాటు లియో ఫస్ట్ లుక్ నెట్టింట హల్ చల్ చేస్తూ.. సినిమాపై క్యూరియాసిటీ పెంచుతున్నాయి. ఈ చిత్రలో పాపులర్ డైరెక్టర్లు గౌతమ్ వాసు దేవ్‌మీనన్, మిస్కిన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారని తెలిసిందే. కాగా ఇప్పుడు మరో ప్రముఖ దర్శకుడు కూడా లియోలో భాగస్వామ్యం కాబోతున్నట్టు వార్త బయటకు వచ్చింది.
ఇంతకీ ఆ డైరెక్టర్ ఎవరనే కదా.. మీ డౌటు. బాలీవుడ్ దర్శకనిర్మాత అనురాగ్ కశ్యప్ (Anurag Kashyap) లియోలో కీలక పాత్రలో నటిస్తున్నాడని బీటౌన్ సర్కిల్ టాక్. స్టార్ డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో స్టార్ హీరో విజయ్ టైటిల్ రోల్లో, ముగ్గురు దిగ్గజ దర్శకులు మిస్కిన్, గౌతమ్ మీనన్, అనురాగ్ కశ్యప్ కీలక పాత్రల్లో సిల్వర్ స్క్రీన్‌పై కనిపించనున్నారనే వార్త సినిమాపై అంచనాలు అమాంతం పెంచేస్తుంది.
విజయ్ సుత్తె పట్టుకొని యాక్షన్ మూడ్‌లో ఉన్న ఫస్ట్ లుక్ పోస్టర్ ఆకట్టుకుంటోంది. మరోవైపు ఫస్ట్ సాంగ్ నా రెడీ సాంగ్ ప్రోమో (Naa Ready Song)ను విడుదల చేయగా.. మంచి స్పందన వస్తోంది. దళపతి విజయ్, అనిరుధ్ రవిచందర్ కలిసి పాడిన ఈ సాంగ్ నెట్టింట మంచి వ్యూస్ రాబడుతోంది. ఈ ప్రాజెక్టులో త్రిష ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. లియోలో బాలీవుడ్ నటుడు సంజయ్‌దత్, యాక్షన్ కింగ్ అర్జున్, ప్రియా ఆనంద్, మలయాళ నటి శాంతి మాయాదేవి, మన్సూర్ అలీఖాన్, మాథ్యూ థామస్, సాండీ కీలక పాత్రలు పోషిస్తున్నారు.
Anurag Kashyap
లియో అక్టోబర్ 19న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ చిత్రానికి మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నాడు. ఈ చిత్రాన్ని సెవెన్ స్క్రీన్ స్టూడియోపై నిర్మిస్తుండగా… లోకేశ్ కనగరాజ్, రత్నకుమార్, ధీరజ్ వైడీ డైలాగ్స్ అందిస్తున్నారు. మాస్టర్ సినిమా తర్వాత విజయ్, లోకేశ్ కనగరాజ్ కాంబోలో వస్తున్న సినిమా కావడంతో అంచనాలు భారీగానే ఉన్నాయి.
నా రెడీ ఫుల్ లిరికల్ వీడియో సాంగ్..
నా రెడీ సాంగ్ ప్రోమో..
లియో టైటిల్ ప్రోమో..