Kannappa | కొంత కాలంగా సరైన బ్రేక్ కోసం ఎదురుచూస్తున్నాడు టాలీవుడ్ యాక్టర్ మంచు విష్ణు (Manchu Vishnu). ఈ టాలెంటెడ్ యాక్టర్ కొన్ని రోజుల క్రితం డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప (Kannappa)ను ప్రకటించాడని తెలిసిందే. న్యూజిలాండ్‌లో ఇటీవలే కన్నప్ప షూటింగ్ కూడా షురూ అయింది. ముఖేశ్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం మరోసారి వార్తల్లో నిలిచింది.పలువురు పాన్ ఇండియా హీరోలు భాగస్వామ్యం కాబోతున్నారని వార్తలు వచ్చాయి. తాజాగా మరో పాన్ ఇండియా స్టార్ కూడా కన్నప్పలో నటించబోతున్నాడన్న వార్త హల్ చల్ చేస్తోంది.
ఇంతకీ అతడెవరనే కదా మీ డౌటు. ఇటీవలే జైలర్‌లో నరసింహ పాత్రలో రప్ఫాడించిన శివరాజ్‌కుమార్. ఈ భారీ పాన్ ఇండియా ప్రాజెక్టులో శాండల్ వుడ్ హీరో శివరాజ్‌కుమార్ (Shiv Rajkumar) కీలక పాత్రలో కనిపించబోతున్నాడన్న వార్త ఒకటి ఇండస్ట్రీ సర్కిల్లో రౌండ్ చేస్తోంది. ఈ క్రేజీ వార్తలపై మేకర్స్ నుంచి మాత్రం ఎలాంటి క్లారిటీ లేదు. తాజా వార్తలపై రానున్న రోజుల్లో ఏదైనా స్పష్టత ఇస్తారేమో చూడాలంటున్నారు సినీ జనాలు. భారీ బడ్జెట్‌తో తెరకెక్కనున్న ఈ మూవీలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, మోహన్ లాల్, నయనతార, మధుబాల కీలక పాత్రలో నటిస్తున్నట్టు ఇప్పటికే అప్డేట్స్ వచ్చాయి.
తాజాగా కన్నడ స్టార్ హీరో కూడా టీంతో జాయిన్ కాబోతున్నాడన్న వార్తలతో సినిమాపై అంచనాలు అమాంతం పెరిగిపోతున్నాయి. ఈ చిత్రానికి మెలోడీ బ్రహ్మ మణిశర్మ, స్టీఫెన్ దేవసి మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించనున్నారు. రానున్న రోజుల్లో కన్నప్ప ప్రాజెక్టుపై మరిన్ని వివరాలు అందించనుంది విష్ణు టీం. మొత్తానికి ఈ సారి పాన్ ఇండియా మార్కెట్‌పై పాగా వేయాలని గట్టిగా ఫిక్సయినట్టు బ్యాక్ టు బ్యాక్ అప్డేట్స్తో అర్థమవుతోంది.
Mission. Vision. Passion.
🎬Kannappa: Vishnu Manchu’s Dreams to Reality.Dream Project #Kannappa begins #ATrueIndianEpicTale
“Pooja Ceremony”@themohanbabu @iVishnumanchu @mukeshvachan pic.twitter.com/ItB0N2Q4aP
— Kannappa The Movie (@kannappamovie) September 1, 2023