వెంకటేశ్ 75వ సినిమా ‘సైంధవ్’. నిహారిక ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై వెంకట్ బోయనపల్లి నిర్మిస్తున్న ఈ చిత్రానికి దర్శకుడు శైలేష్ కొలను. తమిళ హీరో ఆర్య ఇందులో ఓ ప్రత్యేక పాత్ర పోషిస్తుండటం విశేషం. దీనికి సంబంధించిన పోస్టర్ని బుధవారం చిత్ర యూనిట్ విడుదల చేశారు.
ఇందులో ఆర్య పాత్ర పేరు మానస్. చేతిలో మిషిన్ గన్తో ైస్టెలిష్గా పోస్టర్లో కనిపిస్తున్నారు ఆర్య. ఇప్పటికే ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్ సిద్దిఖీ ప్రత్యేకపాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఆర్య కూడా భాగమవ్వడం సినిమాపై ఆసక్తిని రేకెత్తిస్తున్న అంశం. ఈ సినిమాకు కెమెరా : ఎస్.మణికందన్, సంగీతం : సంతోష్ నారాయణ్.