Vidudhala Part 2 | కోలీవుడ్ దర్శకుడు వెట్రిమారన్ (Vetri Maaran) డైరెక్షన్లో విజయ్ సేతుపతి (Vijay Sethupathi) లీడ్ రోల్లో నటిస్తోన్న చిత్రం విడుదల పార్ట్ 2 (Vidudhala Part 2). ఈ మూవీ డిసెంబర్ 20న ప్రపంచవ్యాప్తంగా కన్నడ, తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్‌లో బిజీగా ఉంది టీం. కాగా తాజాగా ఆసక్తికర చర్చ ఒకటి నెట్టింట జరుగుతోంది.
సీక్వెల్ రన్ టైం 2 గంటల 52 నిమిషాలు (172 నిమిషాలు). అయితే ఫస్ట్ పార్ట్‌తో పోలిస్తే కేవలం ఈ రన్ టైం 2 నిమిషాలే ఎక్కువ. పార్ట్ 1 లో తెలుగు వెర్షన్ విషయానికొస్తే రిలీజ్ సమయంలో రన్ టైం టాక్ ఆఫ్ ది పాయింట్‌గా నిలిచింది. పార్ట్ 1 లో స్లో నరేషన్ ప్రేక్షకులను రెండు పార్టులుగా డివైడ్ చేసింది. బలమైన కథాంశం ఉన్నప్పటికీ తెలుగు ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన రాబట్టుకుంది. ఇప్పుడిక ఇదే లైన్లో సీక్వెల్ కూడా వస్తుండటంతో మరి తెలుగు ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది.
స్టోరీ టెల్లింగ్‌తో ఇంప్రెస్ చేసే వెట్రిమారన్ టీంకు రన్ టైం మాత్రం మరోసారి ఛాలెంజ్ కానుందంటూ ట్రేడ్ పండితులు అభిప్రాయపడుతున్నారు. మరి కంటెంట్ బాగుంటే చాలు ప్రేక్షకులు వాటన్నింటిని వెనక్కినెట్టేస్తారని సీక్వెల్ నిరూపిస్తుందా..? లేదా అనేది సర్వత్రాఉత్కంఠ నెలకొంది.
Dacoit | అవును వదిలేసాను కానీ అంటున్న మృణాల్ ఠాకూర్.. అడివి శేష్ డెకాయిట్ లుక్ వైరల్
Vijay Sethupathi | టాలీవుడ్ డెబ్యూకు విజయ్ సేతుపతి రెడీ.. ఇంతకీ డైరెక్టర్ ఎవరో మరి..?
Suman | హీరోలకు ఇదొక హెచ్చరిక.. అల్లు అర్జున్ అరెస్ట్‌పై సుమన్