Tiger Nageswara Rao | మాస్ మహారాజా రవితేజతో పాన్ ఇండియా ప్రాజెక్ట్ ‘టైగర్ నాగేశ్వరరావు’ ని నిర్మించారు నిర్మాత అభిషేక్ అగర్వాల్ (Abhishek Agarwal). స్టువర్ట్ పురం గజదొంగ నాగేశ్వరరావు (Nageswara Rao) బయోపిక్ ఇది. జనరల్‌గా బయోపిక్స్ అంటే రాజకీయ నాయకులు, క్రీడాకారులు, సెలబ్రిటీలపై వుంటాయి. కానీ ఒక దొంగపై బయోపిక్ తీయడం సర్ ప్రైజీంగ్గా నిలిచింది. ఇక ఇదే విషయంపై నిర్మాత అభిషేక్ అగర్వాల్ మాట్లాడుతూ.. ఒక దొంగపై బయోపిక్ ఎందుకు తీశామో సినిమా చూస్తే అర్ధమౌతుందని చెప్పారు.
ఇదే సమయంలో ఆయన మరో ఆసక్తికరమైన విషయం చెప్పారు. తన నిర్మాణంలో మరో బయోపిక్‌ని నిర్మించబోతున్నానని వెల్లడించారు. ”ఒక దొంగ బయోపిక్ ఏమిటని చాలా మంది షాక్ అయ్యారు. త్వరలో చేయబోతున్న బయోపిక్ కథ తెలిస్తే ఇంకా షాక్ అవుతారు. ఏడాదిన్నరగా ఆ కథపై వర్క్ చేస్తున్నాం. ఇప్పుడు ఫైనల్ స్టేజ్‌కి వచ్చింది. త్వరలోనే బయోపిక్‌ని ప్రకటిస్తాం అని చెప్పారు అభిషేక్. ‘టైగర్ నాగేశ్వరరావు’ ఈనెల 20న ప్రేక్షకుల ముందుకు వస్తున్న సంగతి తెలిసిందే.