Anni Manchi Shakunamule Movie Songs | టాలీవుడ్ యంగ్ హీరో సంతోష్ శోభన్ కమర్షియల్ సక్సెస్ కోసం ఎంతో ఎదురు చూస్తున్నాడు. ‘గోల్కొండ హై స్కూల్’తో బాల నటుడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన సంతోష్ నాలుగేళ్లకు ‘తాను నేను’ సినిమాతో హీరో అవతారమెత్తాడు. తొలి సినిమానే డిజాస్టర్ ఫలితాన్నిచ్చింది. దాంతో మూడేళ్లు గ్యాప్ తీసుకుని ‘పేపర్ బాయ్’ వంటి న్యూఏజ్ లవ్‌స్టోరీతో వచ్చాడు. ఈ సినిమాకు క్రిటిక్స్ నుంచి మంచి రేటింగ్ లభించిన కమర్షియల్‌గా సేఫ్ కాలేకపోయింది. దాంతో మరో మూడేళ్లు గ్యాప్ తీసుకుని ‘ఏక్ మినీ కథ’ వంటి బోల్డ్ కంటెంట్‌తో వచ్చి ప్రేక్షకుల మెప్పు పొందాడు. నేరుగా ఓటీటీలో రిలీజైన ఈ సినిమాకు మంచి ఆదరణ వచ్చింది.
సంతోష్ శోభన్ పేరు కాస్తో కూస్తో జనాలకు రిజిస్టర్ అయింది. ఆ తర్వాత మళ్లీ ఫ్లాపుల బాట పడ్డాడు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా బ్యాక్ టు బ్యాక్ నాలుగు ఫ్లాపులు పలకరించాయి. దాంతో సంతోష్ మార్కెట్ అమాంతం పడిపోయింది. రొటీన్ కథలతో వస్తూ జనాలకు కూడా బోర్ కొట్టేశాడు. ప్రస్తుతం సంతోష్ ఆశలన్ని ‘అన్ని మంచి శకునములే’ సినిమాపైనే ఉన్నాయి. నందిని రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని రిలీజ్‌కు సిద్ధంగా ఉంది. ఈ క్రమంలో చిత్రబృందం వరుస అప్డేట్లు ప్రకటిస్తూ సినిమాపై మంచి హైప్ క్రియేట్ చేస్తు్స్తున్నారు. తాజాగా మేకర్స్ ఈ సినిమాలోని మెరిసే మబ్బుల్లో అనే మెలోడి సాంగ్‌ను రిలీజ్ చేశారు.
లేటెస్ట్గా రిలీజైన ఈ సాంగ్ ఇన్‌స్టాంట్‌గా ఎక్కేస్తుంది. మిక్కీ జే మేయర్ ట్యూని మంచి ఫీల్‌ను కలిగిస్తుంది. అదే ఫీల్‌తో నకుల్, రమ్య భట్ ఆలపించారు. రెహమన్ లిరిక్స్ అందించాడు. ఇప్పటి వరకు సినిమా నుంచి రిలీజైన ప్రతీది మంచి ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఈ సినిమాలో సంతోష్‌కు జోడీగా మాళవికా నాయర్ నటిస్తుంది. స్వప్న సినిమాస్ బ్యానర్‌పై స్వప్న దత్ ఈ సినిమాను నిర్మిస్తుంది. అవుట్ అండ్ అవుట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ సినిమా మే 12న రిలీజ్ కానుంది.