అంకిత్ కొయ్య, నీలఖి జంటగా నటించిన యూత్‌ఫుల్ లవ్‌డ్రామా ‘బ్యూటీ’. జె.ఎస్.ఎస్.వర్ధన్ దర్శకుడు. విజయ్‌పాల్‌రెడ్డి అడిదల, ఉమేష్ కుమార్ భన్సల్ నిర్మాతలు. ఈ నెల 19న సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా ఆదివారం హైదరాబాద్‌లో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. అగ్ర దర్శకుడు మారుతి, నిర్మాత ఎస్కేఎన్ ఈ కార్యక్రమానికి అతిథులుగా విచ్చేసి చిత్ర యూనిట్‌కు శుభాకాంక్షలు అందించారు. ‘బ్యూటీ సినిమా ఏ ఒక్కరినీ నిరాశపరచదు. సినిమా చూసి నచ్చకపోతే సున్నా రేటింగ్ ఇవ్వండి. నచ్చితే మాత్రం ప్రమోట్ చేయండి.’
అని హీరో అంకిత్ అన్నారు. దర్శకుడు మాట్లాడుతూ ‘ప్రతి ఒక్కరినీ సీట్ ఎడ్జ్‌లో కూర్చోబెట్టే సినిమా ‘బ్యూటీ’. స్క్రిప్ట్ ఈ సినిమాకు ప్రధాన బలం. ఓ హీరో ఓ మూవీని భుజానికి ఎత్తుకుని చేస్తే ఎలా ఉంటుందో ‘బ్యూటీ’ మూవీ అలా ఉంటుంది. హీరో అంకిత్ ఈ సినిమాకోసం చాలా కష్టపడ్డాడు. విజయ్ బుల్గానిన్ సంగీతం సినిమాను మరోస్థాయిలో నిలబెట్టింది.’ అని పేర్కొన్నారు. ఇంకా నిర్మాత విజయ్‌పాల్‌రెడ్డి అడిదల, కథానాయిక నీలఖి, సీనియర్ నటుడు వీకే నరేష్, నటి వాసుకి, నిమ్మకాయల ప్రసాద్, రైటర్ ఆర్.వి.సుబ్రహ్మణ్యం, ఎగ్జిక్యూటీవ్ ప్రొడ్యూసర్ బి.ఎస్.రావు తదితరులు మాట్లాడారు.