అంజన్ రామచంద్ర, శ్రావణి రెడ్డి జంటగా నటించిన చిత్రం ‘లవ్ రెడ్డి’. స్మరణ్రెడ్డి దర్శకుడు. మైత్రీ డిస్ట్రిబ్యూటర్స్ ద్వారా నేడు సినిమా విడుదల కానుంది. హైదరాబాద్లో ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ సినిమా విజయం పట్ల నిర్మాతలు నమ్మకం వెలిబుచ్చారు. ‘ఈ సినిమాతో నాది రెండేళ్ల ప్రయాణం. ప్రాణం పెట్టి సినిమా చేశాం. రీసెంట్గా వేసిన ప్రీమియర్లకు అద్భుతమైన స్పందన వచ్చింది. ఇదో హార్ట్ టచ్చింగ్ మూవీ. ఇందులో నటులు కనిపించరు. కేరక్టర్లు మాత్రమే కనిపిస్తాయి. సాంకేతికంగా కూడా అభినందనీయంగా ఉంటుందీ సినిమా’ అని దర్శకుడు చెప్పారు.