షాకింగ్ నిర్ణయం తీసుకున్న నువ్వు నేను బ్యూటీ

సినీ పరిశ్రమలో హీరోయిన్స్ ఎంత కాలం ఉంటారనేది చెప్పడం అసాధ్యం. కొందరు ప్రేమలో పడ్డప్పుడు పక్కకు తప్పుకోగా, మరి కొందరు పెళ్లి అయ్యాకనో, లేదంటే పిల్లలు పుట్టాకనో కెరీర్‌ని వదిలేస్తుంటారు. ఇప్పుడు నువ్వు నేను ఫేం అనిత కూడా సంచలన నిర్ణయం తీసుకుంది. అనిత ఒకప్పుడు టాప్ హీరోయిన్ లిస్ట్‌లో ఉండగా, ఆమె నటించిన శ్రీరాం, తొట్టి గ్యాంగ్, నేను పెళ్ళికి రెడీ, ఆడంతే.. ఆడో టైపు, నేనున్నాను. రగడ, జీనియస్” లాంటి సినిమాలు ప్రేక్షకులని అలరించాయి.
హిందీలో ”తాళ్, కుచ్ తో హై, యే దిల్, కృష్ణా కాటేజ్, రాగిణి ఎంఎంఎస్, హీరో” లాంటి చిత్రాల్లో నటించిన ఆమె.. ఉదర్ ఇదర్, కసౌటీ జిందగీ కే, యే హై మొహబ్బతే, నాగిన్ సిరీస్ 3, 4, 5 సీరియల్స్‌తో బుల్లితెర ప్రేక్షకులకు దగ్గరైంది అనిత. కెరీర్ సక్రమంగా కొనసాగుతున్న సమయంలోనే రోహిత్ రెడ్డి అనే వ్యక్తిని పెళ్లాడింది. రీసెంట్గా ఈ దంపతులకు ఓ చిన్నారి జన్మించారు. అయితే తల్లి అయిన తర్వాత అనిత షాకింగ్ నిర్ణయం తీసుకుంది. ఇక నుండి తాను వెండితెర, బుల్లితెరకు దూరంగా ఉండాలని అనుకుంటున్నట్టు పేర్కొంది. తన ఏకాగ్రత పూర్తిగా బిడ్డపైనే ఉంచాలని భావిస్తున్నట్టు పేర్కొంది. కరోనా లేకపోయిన కూడా నా నిర్ణయం ఇలానే ఉండేదంటూ చెప్పుకొచ్చింది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

