Anirudh Ravichander | ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ (Anirudh Ravichander)లో ఉన్న టాలెంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్లలో ఒకడు అనిరుధ్ రవిచందర్. బ్యాక్ టు బ్యాక్ భారీ సినిమాలతో పుల్ బిజీగా ఉన్న ఈ యువ సంగీత దర్శకుడు. స్టార్ హీరోల సినిమాలు చేస్తూ తీరిక లేకుండా ఉన్న అనిరుధ్ తాజాగా సరికొత్త అవతారంలోకి మారిపోయాడు. సంగీత వాయిద్యాలతో కసరత్తు చేసే అనిరుధ్ .. ఈ సారి మాత్రం కండక్టర్‌గా మారిపోయాడు. కండక్టర్ డ్రెస్ కోడ్‌లో ఉన్న అనిరుధ్ నోట్లో విజిల్ పెట్టుకుని.. ఫుట్ బోర్డుపై నిలబడి రైట్ రైట్ అంటోన్న స్టిల్స్ ఇప్పుడు నెట్టింట్లో ట్రెండింగ్ అవుతున్నాయి.
ఇంతకీ అనిరుధ్ రవిచందర్ ఇలా మారడానికి కారణమేమై ఉంటుందా..? అని తెగ ఆలోచిస్తున్నారు సినీ జనాలు. అనిరుధ్ కంపోజ్ చేస్తున్న చిత్రాల్లో రజినీకాంత్ నటిస్తోన్న జైలర్ కూడా ఒకటి. అనిరుధ్ బస్ కండక్టర్ నుంచి సూపర్ స్టార్‌గా మారిన తలైవాను స్పూర్తిగా తీసుకుని.. ఇలా మారడానికి వెనక సీక్రెట్ ఏమై ఉంటుందా..? అనేది ప్రస్తుతానికి సస్పెన్స్ నెలకొంది. ఈ స్టిల్స్ చూసిన అభిమానులు అనిరుధ్ తలైవా 170 (Bus conductor)లో ఏమైనా నటిస్తున్నాడా..? ఏంటీ అని చర్చించుకుంటున్నారు.
ప్రస్తుతం అనిరుధ్ చేస్తున్న సినిమాలన్నీ దాదాపు భారీ బడ్జెట్ సినిమాలే. శంకర్-కమల్ హాసన్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ఇండియన్ 2 (Indian 2). తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ నటిస్తున్న జైలర్ (Jailer), విజయ్-లోకేశ్ కనగరాజ్ కాంబోలో వస్తున్న లియో, ధనుష్ 50, ఆట్లీ-షారుఖ్ ఖాన్ కాంబోలో వస్తున్న జవాన్, కొరటాల శివ-జూనియర్ ఎన్టీఆర్ కాంబోలో వస్తున్న ఎన్టీఆర్ 30, విజయ్ దేవరకొండ-గౌతమ్ తిన్ననూరి VD12, శివకార్తికేయన్, అజిత్ కుమార్ (ఏకే 62) సినిమాలకు మ్యూజిక్ అందిస్తున్నాడు.
Our Rockstar #Anirudh in new FORM!😎
These new pictures has him SLAYING in STYLE as a BUS CONDUCTOR!🌟#AnirudhRavichander #LeoFilm #OnceUponATimeTour #Thalaivar170 #Jawan #Jailer #Indian2 #VidaaMuyarchi #Kavin04 pic.twitter.com/TuvBWKeHJZ
— Cine Barfi! (@CineBarfi) June 12, 2023